calender_icon.png 28 February, 2025 | 9:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాంసాగర్ ఆయకట్టు, రైతుల పంటలు ఎండితే సహించేది లేదు

28-02-2025 04:39:10 PM

ఆయకట్టుకు కెనాల్ నీరు అందక ఎండుతున్న పంటలు..

రాష్ట్ర వ్యవసాయ సలహాదారు దృష్టికి తెచ్చిన రైతులు..

వెంటనే ఇరిగేషన్ అధికారులతో కలిసి  పంటలను పరిశీలించిన బాన్సువాడ ఎమ్మెల్యే..

గుంట భూమి కూడా ఎండ వద్దని అధికారులకు ఆదేశాలు..

పోచారం ఆదేశాలతో హర్షం వ్యక్తం చేస్తున్న రైతులు..

కామారెడ్డి (విజయక్రాంతి): నిజాంసాగర్ కెనాల్  పరిధిలో ఉన్న ఆయకట్టు రైతులకు నీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి గురువారం రాత్రి రైతులు తీసుకెళ్లారు. పెట్టిన పెట్టుబడులు నష్టపోతామని రైతులు పోచారంకు వివరించడంతో ఆయన వెంటనే స్పందించారు. ఎండుతున్న పంటలను పరిశీలిద్దామని పోచారం శ్రీనివాస్ రెడ్డి ఇరిగేషన్ అధికారులను వెంటబెట్టుకొని రాత్రి సమయాన్ని కూడా లెక్క చేయకుండా ఎండుతున్న వరి పంటలను పరిశీలించారు. నిజాంసాగర్ కెనాల్ నుంచి నీటిని ఎక్కువ విడుదల చేయాలని ఎండేస్తున్న పంటలకు సాగునీరు అందే విధంగా చర్యలు చేపట్టాలని వెంటనే ఇరిగేషన్ అధికారులను  ఆదేశించారు. వరి పంట ఒక గుంట కూడా ఎండిపోకుండా చూడాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.

రైతులు ఎన్నో ఇబ్బందులు పడి నిజాం సాగర్ ప్రాజెక్టు నుంచి సాగునీరు అందుతుందని ఉద్దేశంతోనే రైతులు వరి పంట సాగు చేశారని తెలిపారు. నిజాంసాగర్ ప్రాజెక్టులో పుష్కలంగా సాగునీరు ఉన్నప్పటికీ కాలువలు పూడికతతో నిండి చివరి ఆయకట్టు రైతులకు నీరు అందడం గగనం అవుతుందని రైతులు తెలిపారు. నిజాంసాగర్ కెనాల్ నెంబర్ 26, 28 బై ఒకటి ఆయకట్టులోని చెరువులు కుంటలు నిజాంసాగర్ కెనాల్ ద్వారా నీటిని నింపాలని కెనాల్ లో నీటి లేవాలి మూడు ఫీట్లకు తక్కువ కాకుండా ఆయకట్లలోని ప్రతి గుంట కు నీరు అందేలా చూసే బాధ్యత ఇరిగేషన్ అధికారులేదేనని పోచారం తెలిపారు. ఆయన వెంట తెలంగాణ రాష్ట్ర ఆగ్రో కార్పొరేషన్ చైర్మన్ కాసుల బాలరాజు బాన్సువాడ నియోజకవర్గం ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు. పోచారం ఆదేశాలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.