04-03-2025 01:06:52 AM
ఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
నారాయణఖేడ్,మార్చి 3: నిజాంపేట్ నుండి బీదర్ వరకు చేపడుతున్న 161 బి రోడ్డు నిర్మాణ పనులు వేగవంతంగా చేయాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి అన్నారు. సోమవారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నేషనల్ హైవే రోడ్డు పనులు నత్తనడకన కొనసాగుతుందని ఆరోపించారు.
నారాయణఖేడ్ పట్టణంలో గుంతల మయమైన రోడ్లు పరిస్థితి దారుణంగా ఉందన్నారు. ఈ రోడ్డు పనులు కూడా నేషనల్ హైవే పరిధిలోకి వస్తాయని అన్నారు సంబంధిత పనులను కాంట్రాక్టర్ వెంటనే చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. నారాయణఖేడ్లో ఎమ్మెల్యే ఎంపీ ఉన్న కూడా రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారిందని ఆరోపించారు. నాయకులు కమిషన్ల కక్కుర్తిని వదిలి ప్రజలకు మేలు జరిగే విధంగా రోడ్ల నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.
తాము అధికారంలో ఉన్నప్పుడు నిజాంపేట్ బీదర్ రోడ్డు రోడ్డును నేషనల్ మార్పించి 353 కోట్ల నిధులను మంజూరు చేయించామని అన్నారు. కాగా ప్రస్తుతం పనులు మాత్రం నత్త నడకన కొనసాగుతున్న అడిగే నాయకులు లేదన్నారు. పనులు వేగవంతంగా చేపట్టకపోతే తాము ఆందోళన కార్యక్రమానికి సిద్ధమవుతామని పేర్కొన్నారు. వెంటనే పూర్తిస్థాయిలో రోడ్డు పనులు ప్రారంభానికి అధికారులు నాయకులు తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి నరసింహారెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పరశురాం, మాజీ కౌన్సిలర్లు అభిషేక్ షట్కార్, విట్టల్ పట్టణ పార్టీ అధ్యక్షులు నగేష్ సెట్, మాజీ ఎంపిటిసి ముజామిన్ టి ఆర్ ఎస్ వి నియోజకవర్గ అధ్యక్షులు అంజా గౌడ్, మండల పార్టీ ఉపాధ్యక్షులు నర్సింలు యాదవ్, మండల పార్టీ యువత అధ్యక్షులు మచ్చేందర్, కుర్మా సంఘం తాలూకా ఉపాధ్యక్షులు మల్గొండ, మాజీ సర్పంచ్ సంగప్ప తదితరులు పాల్గొన్నారు.