నిజామాబాద్,(విజయక్రాంతి): పెండింగ్‌లో ఉన్న పనులపై అర్‌అండ్‌బీ అధికారులతో నిజామాబాద్ అర్భన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యానారాయణ(MLA Dhanpal Suryanarayana) శనివారం చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్‌పాల్ మాట్లాడుతూ... కలెక్టరేట్ బైపాస్‌లో నిర్మించిన 648 డబుల్ బెడ్ రూమ్‌ల మరమ్మత్తులకు ఇటీవల ప్రభుత్వం నుండి విడుదల అయినా రూ.1.25 కోట్లతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను బ్లాక్ వైజ్ విభజించి వీలైనంత త్వరగా మరమ్మత్తులు ప్రారంభించి పనులు పూర్తి చేయాలని సూచించారు.
నగరంలో వర్ని రోడ్డు నుండి నాగారం వరకు బస్వాగార్డెన్ రోడ్డు,రాజీవ్ గాంధీ సర్కిల్ నుండి దత్తాత్రేయ గుడి వరకు మంజురైనా నాలుగు రోడ్ల నిర్మాణం, దత్తాత్రేయ గుడి బ్రిడ్జి పనులు వేగవంతం చేయాలన్నారు. పనులు నాణ్యతతో చేపట్టాలని అధికారులు, కాంట్రాక్టర్లు చిత్తశుద్దితో పని చేయాలని సూచించారు. నగరంలో రోడ్డు మరమ్మత్తులు జరగడం లేదని గుంతలు పడ్డ రోడ్లతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నగరంలో గుంతలు పుడ్చాలని ఆదేశించారు.