calender_icon.png 4 March, 2025 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీకి చిక్కిన నిజామాబాద్ సబ్ రిజిస్టర్

03-03-2025 07:20:47 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): తెలగాణలో అవినీతి నిరోధక శాఖ అధికారులు కొరడా ఝులిపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కడైన ఉద్యోగులు లంచాలకు చేతులు చాపితే ఏసీబీ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంటుంది. సోమవారం నిజాంబాద్ కవిత కాంప్లెక్స్ లో ఉన్న జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్  ఆఫీస్(Nizamabad Stamps and Registration Office)లో రెండో సబ్ రిజిస్టర్ గా విధరులు నిర్వహిస్తున్న శ్రీరామరాజు లంచం తీసుకు ఏసీబీకి చిక్కారు.

గత కొద్ది రోజులుగా సబ్ రిజిస్టర్ లపై అవినీతి ఆరోపణలు తీవ్రంగా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ కు వచ్చిన డాక్యుమెంట్ తాలూకు వారి నుండి రూ.10 వేలు లంచం తీసుకుంటుండగా నిజామాబాద్ అవినీతి నిరోధక శాఖ డిఎస్పి డిఎస్పీ శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో నగదుతో పట్టుకున్నారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో ముందస్తు పథకం ప్రకారం సబ్ రిజిస్టర్ శ్రీరామరాజును రెడ్ హ్యండెడ్ గా అధికారులు పట్టుకున్నారు. అనంతరం రిజిస్టర్ కార్యాలయంలో సోదాలు నిర్వహించి. శ్రీరామరాజును అదుపులోకి తీసుకొని విచారించారు.