calender_icon.png 18 October, 2024 | 7:49 PM

బదిలీ అయిన పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్

18-10-2024 05:54:59 PM

డిచ్చుపల్లి ఏడవ బెటాలియన్ కమాండెంట్ రోహిణి ప్రియదర్శిని

ఇద్దరూ భార్య భర్తలు సెంట్రల్ సర్వీసెస్ డైరెక్టర్లుగా నియామకం

డిచ్పల్లి (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో పనిచేస్తున్న ఇద్దరు ఉన్నతాధికారులను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన కల్మేశ్వర్ కేంద్ర సర్వీసులకు బదిలీ అయ్యారు. డిచ్పల్లి ఏడవ బెటాలియన్ కమాండెంట్ గా పనిచేస్తున్న రోహిణి ప్రియదర్శిని కేంద్ర సర్వీస్ లకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి బదిలీ చేసి ఉత్తర్వులను జారీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ డిచ్పల్లి ఏడవ బెటాలియన్ కమాండెంట్ గా పని చేసిన రోహిణి ప్రియదర్శిని ఇద్దరు భార్యాభర్తలు కావడంతో కేంద్ర సర్వీసులకు వెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

భార్య భర్తలు ఇద్దరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో డైరెక్టర్లుగా బదిలీ అయ్యారు. నిజామాబాద్ సిపిగా పనిచేసిన కల్మేశ్వర్ 13 అక్టోబర్ 2023న బాధ్యతలు చేపట్టారు. నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో తన పాలనలో మార్క్ ను ప్రదర్శించారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి, నిజామాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ మాజీమంత్రి షబ్బీర్ అలీలు పోలీస్ అధికారుల బదిలీలకు ముందు పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ కొంతమందిని తిరస్కరణకు గురి చేయగా మరికొందరిని వెయిటింగ్ పెట్టి జాయిన్ చేసుకున్న తర్వాత వారి విధుల పట్ల ప్రత్యేక దృష్టి పెట్టడంతో సిపి తన విధుల్లో మార్కును ప్రదర్శించారు. అక్రమార్కులు పైరవీకారులంటే  నచ్చకపోవడంతో బదిలీ వేటు పడిందనే ఆరోపణలు వినవస్తున్నాయి.