సూపరింటెంటెండ్ గా ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్...
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల అనుబంధ ఆసుపత్రి సూపరింటెంటెండ్ గా ఉన్న ప్రతిమా రాజ్ పై వేటు పడింది. ఆమెను బాధ్యతల నుండి తొలగించారు. ఆమె స్థానంలో ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రి సూపరింటెంటెండ్ గా ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టిన జెడ్ చెంగ్తో ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెంటెండ్ పూర్తికాలంగా లేకపోవడంతో ఇంచార్జిగా ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిమరాజ్ ను నియమించారు. ఆసుపత్రిలో ఇటీవల చోటు చేసుకున్న పలు సంఘటనల దృష్ట్యా శ్రీనివాస్ ను సూపరింటెంటెండ్ గా నియమించారు.