టిఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో బాపు రెడ్డి ఒకరు
కేసిఆర్ కు అత్యంత సన్నిహితంగా పని చేసిన బాపురెడ్డి
టిఆర్ఎస్ టికెట్ ఇవ్వకపోవడంతో బీజేపీలో చేరిక
బిజెపిలో పలు కార్యక్రమాల్లో పాల్గొని బిజెపి ఎంపీగా పోటీ చేసి ఓటమి
నిజామాబాద్ జిల్లాలోని వైద్యులలో తీవ్ర విషాదం
నిజామాబాద్ (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లాలో ప్రముఖ వైద్యునిగా పేరు తెచ్చుకున్న జాల బాపురెడ్డి 75 ఇకలేరు. శనివారం రాత్రి హైదరాబాదులో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఈ సంఘటన ఉమ్మడి జిల్లాలోని వైద్యుల్లో విషాదం నింపింది. తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరుగా బాపురెడ్డి ఉన్నారు. కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట మండలం అనంతగిరికి చెందిన జాల బాపురెడ్డి నిజామాబాదులో ఎండి ఫిజీషియన్ గా స్థిరపడ్డారు.
ఎంతోమందికి వైద్య సేవలు అందించారు. బాపురెడ్డి చేతి పడిందంటే రోగాలు పరారని పేరు గడించారు. రోగులకు ఒక నమ్మకం ఉండేది. బాపురెడ్డి వద్దకు వెళ్తే ఏ వ్యాధి అయినా నయమైతదని నమ్మకం రోగుల్లో ఏర్పడింది. ఇతనికి భార్య ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడు నిజాంబాద్ జిల్లాకు బాపురెడ్డి అత్యంత ఆప్తుడుగా ఉండి టిఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ కు సేవలందించారు. ఎమ్మెల్యే టికెట్ కోసం ఎంపీ టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. కేసీఆర్ టికెట్ ఇవ్వక పోవడంతో ఆయన టిఆర్ఎస్ నుంచి బిజెపి లోకి చేరారు.
బిజెపి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు, బిజెపి కార్యక్రమాల్లో సమన్వయకర్తగా పనిచేశారు. ఐఎంఏలు సీనియర్ వైద్యునిగా పలు పదవులు, ప్రముఖ వైద్యునిగా పేర్కొందిన బాపిరెడ్డి గత కొంతకాలంగా లివర్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నారు. గత నాలుగు దశాబ్దాలుగా నిజాంబాద్లో ప్రముఖ ఫిజీషియన్ గా వైద్య సేవలు అందించారు. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో ఆయన సూపర్చితుడు. డాక్టర్ బాపురెడ్డి మృతి పట్ల నిజామాబాద్ ఎంపీ అరవింద్, అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి పలువురు నేతలు వైద్యులు సంతాపం వ్యక్తం చేశారు.