calender_icon.png 3 January, 2025 | 12:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గొర్రెపాటి మాధవరరావు కు బార్ అసోసియేషన్ నివాళి

31-12-2024 01:51:35 PM

నిజామాబాద్,(విజయక్రాంతి): నిజామాబాద్ బార్ అసోసియేషన్(Nizamabad Bar Association) సీనియర్ న్యాయవాది గొర్రెపాటి మాధవరావు(Gorrepati Madhava Rao) నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా కొనసాగి పౌర సమాజానికి చేసిన సేవలు మరువలేనివని ఆయన మరణం  న్యాయవాద సమాజానికి తీరని లోటని బార్ అధ్యక్షుడు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ అన్నారు. బార్ సమావేశపు హల్ లో నిర్వహించిన సంతాపసభలో ఆయన మాట్లాడారు. నలభై రెండేళ్ల న్యాయవాద ప్రస్థానంలో అలుపెరుగని ప్రాక్టీస్ చేశారని ఆయన కొనియాడారు.

యువ న్యాయవాదులు మాధవరావు అధ్యయనశీలిని అలవర్చుకోవాలని జగన్ కోరారు. తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్ సభ్యులు(Members of Telangana State Bar Council) మంథని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ... సహచర న్యాయవాది, ఆత్మీయమిత్రుడిని కోల్పోవడం బాధాకరమని అన్నారు. సమావేశంలో బార్ ఉపాఢ్యక్షుడు రాజు,ప్రధాన కార్యదర్శి వసంత్ రావు,కార్యదర్శి సురేశ్, కోశాధికారి దీపక్,న్యాయవాదులు కవిత రెడ్డి, జగదీశ్వర్ రావు,రాజారెడ్డి, భాస్కర్, పరుచూరి శ్రీధర్, రవీందర్, ఆశా నారాయణ తదితరులు మాధవరావు తో ఉన్న స్మృతులను గుర్తు చేశారు. 

అంతకుముందు జిల్లా కోర్టు ఆవరణంలో న్యాయమూర్తులు  జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత  కుంచాల ఆధ్వర్యంలో సమావేశమై గొర్రెపాటి మాధవరావు కు సంతాపం  ప్రకటించింది సమావేశంలో అదనపు జిల్లా జడ్జి శ్రీనివాసరావు సీనియర్ సివిల్ జడ్జి శ్రీకాంత్ బాబు జూనియర్ సివిల్  జడ్జిలు చైతన్య హరికృష్ణ బార్ అసోసియేషన్ అధ్యక్షులు జగన్మోహన్ గౌడ్ జిల్లా కోర్టు పిపి రాజేశ్వర్రెడ్డి గవర్నమెంట్ లీడర్ ఆముదాల సుదర్శన్ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రాజేందర్ రెడ్డి న్యాయవాదులు పాల్గొన్నారు