calender_icon.png 31 January, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలోనే నిజాం షుగర్స్ పునఃప్రారంభం

31-01-2025 12:35:53 AM

  1. కేంద్రం సహకారం కూడా తీసుకుంటాం
  2. ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్‌రెడ్డి పోటీ చేయరు
  3. రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటిస్తాం
  4. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు

కరీంనగర్, జనవరి 30 (విజయక్రాంతి): త్వరలో నే నిజాం షుగర్ ఫ్యాక్టరీ పునఃప్రారంభం అవుతుందని, 2025 డిసెంబర్ లక్ష్యంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఐటీ, పరిశ్రమలు, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు వెల్లడించారు. ఇందుకు కేంద్రం సహకారం కూడా తీసు కుంటామని, ఒక నెల ముందే పునఃప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నామని తెలిపారు.

గురువారం కరీంనగర్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. తక్కువ పెట్టుబడితో డీప్ సీక్ లాంటి ప్రొడక్ట్ తీసుకురావచ్చని, మన దేశంలోని మేధాశక్తితో (ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్) డీప్ సీక్ లాంటి ఉత్పత్తులకు ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టంచేశారు.

గత ఏడాది తెలంగాణలో మొదటిసారి ఎంఎస్‌ఎంఈ పాలసీని తీసుకొచ్చామని, దేశంలోనే ఈ పాలసీ పేరొందిందని పేర్కొన్నారు. రైతులకు ఉపయోగపడేలా ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్లు తీసుకుంటున్నామని, గ్రామీ ణ ప్రాంతాల్లో మినీ ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను ఏర్పాటు చేయడమే తమ లక్ష్యమని చెప్పారు. ఇలాంటి ఎన్నో లక్ష్యాలతో దావోస్ పర్యటన విజయవంతంగా జరిగిందని గుర్తుచేశారు.

ద్వితీయ, తృతీయశ్రేణి పట్టణాల్లో కూడా హైదరాబాద్‌కు ధీటుగా పెట్టుబడుల కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని వెల్లడించారు. పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచాలనే లక్ష్యంతో దావోస్ పర్యటనకు వెళ్లామని వివరించారు. పెట్టుబడుల ఒప్పం దాలు ఘనంగా జరిగాయని పేర్కొంటూ తెలంగాణ ప్రభుత్వంపై నమ్మకం ఉంచిన కంపెనీలకు ధన్యవాదాలు తెలిపారు. 

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ టీ జీవన్‌రెడ్డి పోటీ చేయనని పార్టీకి చెప్పారని, రెండు, మూడు రోజుల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటిస్తామని  మంత్రి తెలిపారు. కచ్చితంగా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజ యం సాధిస్తారని పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ టికెట్ కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారని, దరఖాస్తులను పరిశీలించామని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ తదితరులు పాల్గొన్నారు. 

హైదరాబాద్‌వైపు ప్రపంచం చూపు

ప్రపంచమంతా హైదరాబాద్‌వైపు చూస్తోందని మంత్రి శ్రీధర్‌బాబు పేర్కొన్నారు. కొండ సత్యలక్ష్మిగార్డెన్‌లో నూతన సాఫ్ట్‌వేర్ కంపెనీని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి శ్రీధర్‌బాబు ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మన యువతలో టాలెంట్ మనకు గొప్ప శక్తి అని, యువతలో మరింత నైపుణ్యం పెంచేందుకు యంగ్ ఇండియా స్కిల్ వర్సిటీని సీఎం రేవంత్‌రెడ్డి ఏర్పాటుచేస్తున్నారని తెలిపా రు.

కరీంనగర్ ఉమ్మడి జిల్లా యువత కోసం నగరంలో ఐటీ కంపెనీలు మరిన్ని రావాల్సిన అవ సరం ఉందన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లర్నింగ్ వంటి పరిజ్ఞానాన్ని యువత అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టెక్‌జీవీ సర్వీసెస్ సాఫ్ట్‌వేర్ సంస్థ సీఈవో కొండ శ్యాంసుందర్, డైరెక్టర్ సాయిరాజ్ పాల్గొన్నారు.