తెలంగాణకు అత్యంత ప్రతిష్ఠాత్మకం, ఆసియాలోనే ఒకప్పుడు అతిపెద్దదిగా వుండిన నిజాం షుగర్స్ ఫాక్టరీని తిరిగి తెరిపిస్తామంటూ బీజీపీ నాయకులు తాజాగా ఎన్నికల సందర్భంగా వాగ్దానాలు చేయడం హర్షనీయం. మిగిలిన అన్ని రాజకీయ పార్టీలూ ఈ ఫ్యాక్టరీ విషయంలో సానుకూలంగానే ఉన్నా ఎందువల్లో ఈ పని కార్యరూపం దాల్చడం లేదు. ఒకప్పుడు పెద్ద సంఖ్యలో చక్కెర ఫ్యాక్టరీలు వుండేవి. ఇప్పుడు అవి బాగా అరుదైపోయాయి. మంచి మద్దతు ధరకు పంటను కొనే ఫ్యాక్టరీలు వున్నప్పుడే చెరుకు పంట వేద్దామనుకొనే రైతులకు మేలు జరుగుతుంది.
రవీందర్, రాజన్న సిరిసిల్ల