calender_icon.png 26 October, 2024 | 7:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐపీఓకు నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్

02-07-2024 05:02:31 AM

  • రూ.3వేల కోట్ల సమీకరణ

న్యూఢిల్ల్లీ: ప్రముఖ బీమా సంస్థ ’నివా బుపా హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్’ ఐపీఓకికు రాబోతోంది. ఈమేరకు సెబీ ఆమోదం కోరుతూ ప్రాథమిక పత్రాలు సమర్పించింది. దాదాపు రూ.3,000 కోట్ల నిధు లు సమీకరించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది. ప్రతిపాదిత ఐపీఓలో రూ.800 కోట్లు విలువ చేసే కొత్త షేర్లను జారీ చేయాలనుకుంటున్నట్లు నివా బుపా తెలిపింది. మరో రూ. 2,200 కోట్ల షేర్లు ప్రమోటర్లు, ఇన్వెస్టర్లు తమ వాటాల నుంచి విక్రయించే యోచనలో ఉన్నట్లు వెల్లడించింది.

ఇన్వెస్టర్ ఫెటిల్ టోన్ ఎల్‌ఎల్పీ రూ.1,880 కోట్లు, ప్రమోటర్ బుపా సింగపూర్ హోల్డింగ్స్ లిమిటెడ్ రూ.320 కోట్లు విలువ చేసే షేర్లను ఐపీఓలో ఉంచుతున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ నిర్వహణను ప్రధానంగా యూకే కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ కంపెనీ బుపా చేపడుతోంది. ప్రస్తుతం 62.27 శాతం వాటా బుపా సింగపూర్ హోల్డింగ్స్‌కు, 27.86 శాతం వాటా ఫెటిల్ ఎల్‌ఎల్‌పీకి ఉంది.దేశీయంగా ఐపీఓకు వస్తు న్న రెండో ఆరోగ్య బీమా సంస్థ నివా బుపా. గతంలో ’స్టార్ హెల్త్ అండ్ అలైడ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ పబ్లిక్ ఇష్యూకు వచ్చింది.