హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ నివా బుపా రూ.2,200 కోట్ల సమీకరణకు తెస్తున్న పబ్లిక్ ఆఫర్ నవంబర్ 7న ప్రారంభమై 11న ముగుస్తుంది. ఈ ఐపీవోలో రూ. 800 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేస్తుండగా, మరో రూ. 1,400 కోట్ల విలువైన షేర్లను ప్రస్తుత ఇన్వెస్టర్లు ఓఎఫ్‌ఎస్ మార్గంలో విక్రయిస్తారు. ఈ ఆఫర్‌కు ప్రైస్‌బ్యాండ్‌ను ఇంకా వెల్లడించలేదు.