తిరుమల తరహాలో తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమయిన వేముల వాడలో నిత్యాన్నదాన సత్రాన్ని ఏర్పాటు చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించడం సంతోషకరం. రాష్ట్రంలో యాదాద్రి తర్వాత అత్యధిక సంఖ్యలో భక్తులు వచ్చే క్షేత్రాల్లో వేములవాడ ఒకటి. నిత్యం వేలాది మంది రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. ఈ భక్తుల కోసం నిత్యాన్నదాన పథకాన్ని అమలు చేయాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించడం ముదావహం. ఇందుకోసం దాతలు ముందుకు వచ్చి ఉదారంగా విరాళాలు సమర్పించాలని మంత్రి కోరారు. దీనివల్ల భక్తులకు పుణ్యంతో పాటు పురుషార్థం కూడా లభిస్తుంది. తిరుమల వెంకన్న కోసం కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చే భక్తులు ఈ మంచి కార్యానికి కూడా సహకరిస్తారని ఆశిద్దాం.
సుబ్రహ్మణ్య శర్మ, కేపీహెచ్‌బీ కాలనీ