calender_icon.png 24 October, 2024 | 5:03 AM

తిరుమల తరహాలో వేములవాడలో నిత్యాన్నదాన సత్రం

29-08-2024 04:20:28 AM

  1. నిర్మాణానికి దాతలు ముందుకు రావాలి 
  2. ప్రణాళికాబద్ధంగా సత్రం నిర్మాణం 
  3. రాష్ట్ర బీసీ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 
  4. ఆలయంలో స్వామివారిని దర్శించుకున్న మంత్రి

రాజన్న సిరిసిల్ల, ఆగస్టు 28 (విజయక్రాంతి): భక్తుల సౌకర్యార్థం వేములవాడ రాజరాజేశర సామి ఆలయ సన్నిధిలోనూ తి రుమల తరహాలో నిత్యాన్నదాన సత్రాన్నిని ర్మిస్తామని, అందుకు దాతలు ముందుకు రా వాలని రాష్ట్ర బీసీ, రవాణా శాఖ మంత్రి పొ న్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సత్రం నిర్మాణానికి ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్తామ న్నారు. భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే రాష్ట్రప్రభుత్వ ధ్యేయమన్నారు. ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డితో పాటు మంత్రులు సంపూర్ణ సహకారం అందిస్తున్నారని కొనియాడారు.

అనంతరం మంత్రి పట్టణంలో అందుబాటులోకి వచ్చిన కేడీసీసీ వేములవాడ శాఖ నూతన భవనాన్ని ప్రారంభించారు. సహకార బ్యాంక్ నుంచి ల బ్ధిదారులకు విద్య, గృహ, సయం ఉపాధికి సంబంధించిన రుణ చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న దన్నారు. యావత్ తెలంగాణలో 70 శాతం మంది లబ్ధిదారులు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారని, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తున్నామన్నారు.

అర్హులందరికీ రుణమాఫీ చేస్తామన్నారు. వచ్చే నెల 17 నుంచి ప్రజా పాలనలో భాగంగా ఆ రు గ్యారెంటీల దరఖాస్తులు, నూతన రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు సీకరిస్తామని తెలిపారు. మంత్రి వెంట ప్రభుత విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్‌ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్, ఆలయ ఈవె వినోద్‌రెడ్డి తదితరులున్నారు.