25-03-2025 12:00:00 AM
బెట్టింగ్ అనేది సర్వాంతర్యామి గా మారింది. ఐపీఎల్ మ్యాచ్‌ల సందర్భంగా దేశంలో క్రికెట్ బెట్టింగులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇది చాలదన్నట్లు పలు నిషేధ బెట్టింగ్ యాప్స్‌ను ప్ర మోట్ చేస్తూ అగ్రతారల ప్రచారం మరోవైపు. జిల్లా కేంద్రాలతో పాటు మండల, గ్రామీణ ప్రాంతాల్లో అక్రమ దందా ఊపందుకుంది.
ఐపీఎల్ బెట్టింగ్ ఇంతకు ముందు నగరాలకే పరిమితం కాగా ప్రస్తు తం పల్లెలకు కూడా పాకింది. గూగుల్ టేక్ ద్వారా ఎక్కువగా డబ్బు మార్పిడి జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తే ప్రధాన విద్యా సంస్థలు, అసంఘటితంగా ఉన్న డ్రైవర్లు, కూలి పనులు చేసుకునేవారు, కార్మికులు డబ్బు సులభంగా సంపాదించాలని కోరికతో బెట్టింగ్ బారిన పడుతున్నారు.
ఆత్మహత్యలకు పాల్పడుతున్న అమాయకులు
బెట్టింగ్ యాప్‌లలో పెట్టుబడులు పె ట్టి లక్షల్లో కోల్పోయి అప్పుల భారంతో అవమానాలు భరించ లేక ఆత్మహత్యలు చేసుకొంటున్న వారి గురించి మనం రో జూ వార్తల్లో చూస్తున్నాం. తాజాగా సినీ న టులు, టీవీ యాంకర్లు లాంటి వాళ్లు సైతం ఈ బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. సెలబ్రిటీలు ప్రచారం చేయడంతో వారి ప్రభావంతో అనేకమంది అమాయకులు ఈ యాప్‌లలో పెట్టుబడులు పెట్టి సర్వం కోల్పోతున్నారు.
ప్రచారం చేసిన వారు బాగానే ఉంటున్నారు కానీ డబ్బులతో పా టుగా ప్రాణాలు కోల్పోతున్న వారు, వారి ని నమ్ముకొని బతుకుతున్న కుటుంబ సభ్యుల గతి ఏమని ఎవరూ ఆలోచించ డం లేదు. డబ్బు ఒక్కటే పరమార్థమా? సెలబ్రిటీలకు సామాజిక బాధ్యత లేదా? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము తెలియక ఈ యాడ్స్ చేశామని, తప్పని తెలుసుకున్నామని అంటూనే బెట్టింగ్‌కు ఎ వరూ పాల్పడవద్దని ఆ సెలబ్రిటీలు ఇప్పు డు చెబుతున్నారు. కానీ జరిగిన నష్టానికి బాధ్యులు ఎవరనేదే ప్రశ్న
పరీక్షల సమయంలో మ్యాచ్‌లు
ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది భారత్‌లో ఒక ప్రొఫెషనల్ ట్వంటీ 20 క్రికెట్ లీగ్. ప్రపంచంలోని అత్యంత ప్రజాదరణ పొందిన లాభదాయకమైన క్రికెట్ లీగ్‌ల లో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సారి దేశంలోని పది నగరాలకు ప్రాతిని ధ్యం వహించే పది జట్లు ఉన్నాయి, ప్రతి సంవత్సరం ఉష్ణోగ్రత నలభై డిగ్రీలు దా టినప్పుడు, విద్యార్థులకు టర్మ్ ఎండ్ పరీక్షలు ఉన్నప్పుడు టోర్నమెంట్ జరుగుతుం ది.
ప్రతి సంవత్సరం మార్చి నుంచి మే వ రకు జరుగుతుంది. ఐపీఎల్ ఉద్దేశ్యం ప్ర పంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ క్రికెటర్లు తమ నైపుణ్యాలను ప్రదర్శించడానికి వేదిక అందించడం, దేశంలో, ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ క్రీడను ప్రోత్సహించడం. అయితే వి ద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగేట్లు షె డ్యూల్ ఉంది. అలాగే ప్రతికూల వాతావరణంలో పోటీలు పెడుతున్నారు. నిరంతర విమర్శలు ఉన్నప్పటికీ, ఇది గరిష్ఠ సంఖ్య లో వీక్షకులను సంపాదించుకో కలిగింది.
దేశంలో స్పోర్ట్స్ బెట్టింగ్ అనేది గుర్రపు పందెం లాంటిది. బెట్టింగ్ చాలావరకు చ ట్టవిరుద్ధం. క్రీడల బెట్టింగ్ అనేది రాష్ట్రాల చట్టాలపై ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో క్రికెట్‌పై మరే ఇతర దేశంతో పోల్చ లేని ప్రేమ ఉంది. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌పై బెట్టింగ్ అన్నింటినీ మించిపోయింది. క్రికెట్ పిచ్చి ఉన్న ఆటగాళ్లు, ఐపీఎల్ మ్యాచ్‌ల నేపథ్యంలో టీవీలకే అతుక్కుపోతున్నారు.
మరోవైపు పందెం రాయుళ్లు సందట్లో సడేమియా అనే చం దంగా ఒకవైపు క్రికెట్‌ను ఆస్వాదిస్తూనే మరోవైపు తమదైన శైలిలో బెట్టింగ్ కాస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గుట్టు చప్పు డు కాకుండా సాగుతున్న ఈ బెట్టింగ్‌లో కోట్లాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. చాలా మంది యువ కులు ఈ బెట్టింగ్ బారినపడి నష్టపోయి ఆర్థికంగా చితికిపోయి చివరికి ప్రాణాలు తీసుకుంటున్నారు.
ఇరవై శాతం కాలేజీ పిల్లలు, యువత బెట్టింగ్ యాప్ డౌన్‌లో డ్ చేసుకుని బెట్టింగ్ పాల్పడుతున్నారు. గత పది పదిహేనేళ్ల క్రితం మొదలైన ఈ క్రికెట్ బెట్టింగ్ వ్యసనం, మొదట్లో కేవలం ఇండియా టీమ్ ఆడే మ్యాచ్ లకు మాత్ర మే ఉండేది. రాను రాను ఇది మరింత ముదిరి పాకాన పడింది. ముఖ్యంగా టీ-20 మ్యాచ్‌లు ప్రారంభమైనప్పటి నుంచి బె ట్టింగ్ జాడ్యం ఊపందుకుంది. దీనికి తో డు అగ్నికి ఆజ్యం పోసినట్లు ఐపీఎల్ యు వతను మరింత కట్టి పడేసింది.
ఒకే సీజన్‌లో వరసగా సుమారు 80కి పైగా మ్యాచ్‌లు జరుగుతుండటంతో బెట్టింగ్‌ల జోరుకు అడ్డుకట్ట అనేది లేకుండా పో యింది. ఈ సారి అప్పుడే బెట్టింగ్ రా యుళ్ల హవా మొదలైంది. ప్రస్తుత రోజు ల్లో యువతకు అధునాతన సెల్‌ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లు అందుబాటులో ఉండడంతో గుట్టచప్పుడు కాకుండా ఆన్‌లైన్ ద్వారా బెట్టింగులకు పాల్పడుతున్నారు. డబ్బు దొరకనప్పుడు దొంగతనాలకు, ఆన్‌లైన్ మోసాలకూ పాల్పడుతున్నారు.
సైబ ర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాల్లో ఎ క్కువగా బెట్టింగ్, మాదకద్రవ్యాలకు, ఆర్థిక నేరగాళ్లు అధికం. క్రికెట్ బెట్టింగ్‌ను నడిపించే ముంబై, ఢిల్లీ, హైదరాబాద్ సం బంధించి బుకీలతో పట్టణ ప్రాంతాలకు చెందిన కొందరు ప్రముఖులు సంబంధాలు పెట్టుకుని ఈ వ్యవహారాన్ని రహ స్యంగా సాగిస్తున్నారు. పందేలు కాసేవారు బుకీల వద్ద కోడ్ భాష వినియో గిస్తూ అనుమానం రాకుండా కొనసాగిస్తున్నారు.
మ్యాచ్ జరిగే రోజున అప్పటికప్పు డే ఆన్‌లైన్ ద్వారా లావాదేవీలు జరుపు తూ యువత బెట్టింగ్‌లో పాల్గొంటున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడితే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. అయినా కొంతమంది మాత్రం బెట్టింగ్‌నే వృత్తిగా సాగిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు నిఘా పెట్టి క్రికెట్ బెట్టింగ్‌లకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి.
బెట్టింగ్‌లు చట్ట విరుద్ధమే
దేశంలో పందెం వేయడానికి ఇతర ప్రసిద్ధ క్రీడలు బ్యాడ్మింటన్, టెన్నిస్, బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్ వంటి అంతర్జాతీయ క్రీడలు. ఫలితం అనిశ్చితి క్రీడ ఆకర్ష ణలో ముఖ్యమైన భాగం. ఫలితం ముందుగా నిర్ణయించబడితే, క్రీడల సమగ్రత పోతుంది. దానితో ఎక్కువ భాగం అర్థం అభిమానులను ఆకర్షిస్తుంది. మ్యాచ్ ఫిక్సింగ్ అనేది క్రీడకు పెద్ద ముప్పుగా ఉంది.
ఆన్‌లైన్ జూదం ఆగమనం ఆర్థిక లాభం కోసం మ్యాచ్ ఫిక్సింగ్ ప్రమాదాన్ని పెంచింది. ప్రపంచ జూద పరిశ్రమ భారీ స్థాయి వ్యవస్థీకృత నేరాలకు ఆకర్షణీయంగా ఉంది. ఇది వృత్తిపరమైన క్రీడ భవిష్యత్తుకు ప్రాథమిక ప్రపంచవ్యాప్త ముప్పు. స్పోర్ట్స్ బెట్టింగ్ చట్టం అనేది గందరగోళంగా, సంక్లిష్టమైన అంశం. ఎందుకంటే ప్రతి దేశానికి స్పోర్ట్స్ బెట్టింగ్‌కు సంబంధించి దాని స్వంత చట్టాలు ఉన్నాయి.
ఈ చట్టంలో ఎక్కువ భాగం కచ్చితంగా ఏది చట్టబద్ధమైనది. ఏది కాదో స్పష్టం చేయడంలో విఫలమైంది. గుర్రపు పందాలపై బెట్టింగ్‌లు మినహా భారతదేశంలో క్రీడల బెట్టింగ్‌లు ప్రధానంగా చట్టవిరుద్ధం. ఇతర క్రీడలు రాష్ట్రాల చట్టాలు లేదా భారతదేశ సాధారణ చట్టాలపై ఆధారపడి ఉంటాయి.
భారతదేశంలో ఎక్కువ భాగం పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867, టెక్నాలజీ యాక్ట్ 2000కి లోబడి ఉంది. ఆ చట్టాల ప్రకారం స్పోర్ట్స్ బెట్టింగ్ అనుమతించబడదు కానీ ఒక్కో రాష్ట్రానికి వారి స్వంత చట్టాలు రూపొందించుకునే హక్కు ఉంటుంది.
పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ (1867) ప్రకారం భారతదేశంలో అన్ని రకాల జూదాలు చట్టవిరుద్ధం. కానీ, భారతీయ వ్యవస్థలో ఆన్‌లైన్ జూదాన్ని నిషేధించే నిర్దిష్ట చట్టం ఏదీ లేదు. బెట్టింగ్ కంపెనీలు భారతీయులను ప్రతిదానిపై పందెం వేయడానికి ఈ లొసుగులను ఉపయోగించుకుంటున్నాయి. ఐపిఎల్ ద్వారా చదువు అటకెక్కడం, విద్యార్థులు ఏకాగ్రతకు భంగం కలగడం, యువత పెడధోరణి అవలంబించడం, తప్పుడు మార్గాలు ఎంచుకోవడం గమనిస్తున్నాం.