పాట్నా, ఆగస్టు 4: బీహార్‌ను సుదీర్ఘకా లంగా పాలిస్తున్న జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ రాష్ట్రాభివృద్ధికి వచ్చిన అనేక అవకాశాలను పోగొట్టారని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, రాజకీయ నాయకుడు ప్రశాంత్‌కిషోర్ విమర్శించారు. ఆదివారం ఆయన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. కేంద్రంలో ఇప్పుడు అత్యంత కీలకంగా మారినప్పటికీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తేలేకపోయారని ఆరోపించారు. మూతపడిన 20 చక్కెర మిల్లును ఎందుకు తెరిపించలేదని నిలదీశారు. జన్ సురాజ్ పేరుతో కొత్త పార్టీ స్థాపించిన ప్రశాంత్ కిషోర్.. రాష్ట్రంలో విస్తృతంగా పర్యటించి సభలు నిర్వహిస్తున్నారు.