న్యూఢిల్లీ, జూలై 29: బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. రిజర్వేషన్లపై పాట్నా హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రభుత్వ ఉద్యో గాలు, విద్యా సంస్థల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు 50 శాతం నుంచి 65 శాతానికి పెంచుతూ బీహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకొచ్చిన బిల్లును పాట్నా హైకోర్టు గతం లో కొట్టివేసింది. ఈ తీర్పును సవాలు చేస్తూ బీహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
తాజాగా, ఈ ఉత్తర్వులపై విచారణ జరిపిన సుప్రీం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. నితీష్ కుమార్ సర్కారు గతేడాది నవంబర్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను 65 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేసిం ది. అయితే, ఈ పెంపు పై కొన్ని వర్గా లు హైకోర్టులో సవాల్ చేశాయి. హై కోర్టు జూన్ 20న 65 శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలన్న బీహార్ విన్నపాన్ని సుప్రీం తిరస్కరించింది.