calender_icon.png 19 April, 2025 | 4:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీతి ఆయోగ్ పనులను పూర్తి చేయాలి

27-03-2025 12:00:00 AM

కలెక్టర్ వెంకటేష్ ధోత్రే 

కుమ్రం భీం ఆసిఫాబాద్, మార్చి26 (విజయక్రాంతి): నీతి ఆయోగ్ పథకంలో భాగ మైన యాస్పిరేషన్ బ్లాక్ పనులను త్వరగా చేపట్టాలని కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్లతో కలసి వైద్య, విద్య, గ్రామీణ అభివృ ద్ధి, పశు సంవర్ధక, గిరిజన సంక్షేమ శాఖల అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భం గా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లా బ్లాక్‌లో అంబులెన్స్ సర్వీస్ కల్పించేందుకు అవసరమైన పరిపాలన అనుమతులు రూపొందిం చాలని తెలిపారు. 20 గురుకుల పాఠశాల లు సంక్షేమ వసతి గృహాల్లో స్వచ్ఛమైన తాగునీరు, జిల్లా కేంద్రంలో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుకు స్థలాన్ని ఎంపిక చేసి నిర్మాణ అనుమతులు పొందాలని, యానిమల్ బర్త్ కంట్రోల్ కేంద్రాన్ని పట్టణ సమీపంలో ఏర్పాటు చేసేందుకు స్థలం  గుర్తించాలని  వీటితోపాటు మంజూరైన పలు అభివృద్ధి పనులను చేపట్టాలని అధికారులను ఆదేశించారు.