calender_icon.png 20 September, 2024 | 9:28 AM

ముగిసిన నీతి ఆయోగ్ సమావేశం.. వికసిత్ భారత్ 2047పై చర్చ

27-07-2024 05:00:32 PM

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశం శనివారం సాయంత్రం ముగిసింది. 2047 నాటికి దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు చేపట్టాల్సిన ప్రణాళికపై సమావేశంలో చర్చించారు. రాష్ట్రాల అభివృద్ధి, దేశాభివృద్ధిపై తమ అభిప్రాయాలను ముఖ్యమంత్రులు వెల్లడించారు. నీతి ఆయోగ్ పాలక మండలి భేటీలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగించారు.  2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ అనేది ప్రతి భారతీయుడి ఆశయమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. వందేళ్లలో ఒకసారి వచ్చే మహమ్మారిని ఓడిచాం మన్న మోడీ మన ప్రజలు ఉత్సాహం, విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. అన్ని రాష్ట్రాల ఉమ్మడి కృషితో 2047 నాటికి వికసిత భారత్ కు కలను నెరవేర్చుకోగలమని ప్రధాని మోడీ పేర్కొన్నారు. అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ మంత్రులు హాజరుకాలేదు. నీతి ఆయోగ్ భేటీలో పాల్గొన్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మధ్యలో వాకౌట్ చేశారు. తను మాట్లాడుతున్న సమయంలో మైక్ కట్ చేశారని కేంద్రంపై ఆమె తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.