calender_icon.png 19 January, 2025 | 12:04 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిమాన హీరోతో పోటీపడనున్న నితిన్

19-01-2025 12:00:00 AM

అటు తిరిగి ఇటు తిరిగి హీరో నితిన్ ఏకంగా తను అత్యంత ఎక్కువగా అభిమానించే పవన్ కల్యాణ్‌తోనే తలపడబోతు న్నాడు. ఆయన హీరోగా నటించిన చిత్రం ‘రాబిన్ హుడ్’. వెంకీ కుడుముల దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. శనివారం మేకర్స్ ప్రకటించిన ప్రకారం.. మార్చి 28న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. వాస్తవానికి ఈ సినిమా క్రిస్మస్ సందర్భంగానే రావాల్సి ఉంది.

అనుకోని కారణాలతో వాయిదా పడింది. మొత్తానికి రిలీజ్ డేట్ ఫిక్సయింది. అయితే అదే రోజు పవన్ ‘హరిహర వీరమల్లు’ సినిమా కూడా విడుదల కానుంది. పవన్‌ను దేవుడిలా భావించే నితిన్.. ఈ వేసవికి ఆయనతోనే తలపడనుండటం ఆసక్తిక రంగా మారింది. ‘రాబిన్ హుడ్’ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ సినిమా ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.