calender_icon.png 16 October, 2024 | 3:56 PM

అమరన్ పాటను విడుదల చేసిన హీరో నితిన్

08-10-2024 12:00:00 AM

సాయి పల్లవి, శివకార్తికేయన్ జంటగా నటించిన చిత్రం ‘అమరన్‘. రాజ్‌కుమార్ పెరియసామి ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ చిత్రాన్ని ఉలగనాయగన్ కమల్‌హాసన్, మహేంద్రన్, సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్, గాడ్ బ్లస్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ‘హే రంగులే’ పాటను హీరో నితిన్ లాంచ్ చేశారు. సాయి పల్లవి పాట అంటే ప్రత్యేకంగా చెప్పాలా? అద్భుతంగా ఉంటుంది.

జీవీ ప్రకాశ్ ఈ పాటను అద్భుతంగా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి కలం నుంచి జాలువారిన పదాలు సాయి పల్లవి, శివకార్తికేయన్‌ల కెమెస్ట్రీని అద్భుతంగా వ్యక్తపరిచాయనడంలో సందేహం లేదు. అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా పాటకు ప్రాణం పోశారు.

ఈ చిత్రాన్ని శివ్ అరూర్, రాహుల్ సింగ్ రాసిన ఇండియాస్ మోస్ట్ ఫియర్లెస్ అనే పుస్తకంలోని మేజర్ వరదరాజన్ చాప్టర్ ఆధారంగా రూపొందించారు. అమరన్ చిత్రం ఈ దీపావళికి అక్టోబర్ 31న థియేటర్లలో విడుదల కానుంది. నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సోదరి నిఖితా రెడ్డి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రేష్ట మూవీస్ బ్యానర్ ద్వారా విడుదల చేయనున్నారు.