calender_icon.png 18 January, 2025 | 7:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిషా పట్టు సరిపోలేదు

06-08-2024 02:13:10 AM

క్వార్టర్స్‌లో ఓడిన భారత రెజ్లర్

పారిస్: విశ్వక్రీడల్లో రెజ్లింగ్ పోటీలు మొదలయ్యాయి. అయితే పోటీలో తొలి రోజే మనకు నిరాశ ఎదురైంది. మహిళల 68 కేజీల ఫ్రీస్టుల్ విభాగంలో నిషా దహియా క్వార్టర్స్‌లో ఇంటిబాట పట్టింది. సోమవారం జరిగిన క్వార్టర్స్‌లో నిషా 8  తేడాతో ఉత్తర కొరియా రెజ్లర్ సోల్‌గమ్ చేతిలో పరాజయం పాలైంది.  తొలి బౌట్‌లో దూకుడు ప్రదర్శించిన నిషా.. ఒకానొక సమయంలో సునాయసంగా గెలిచేలా కనిపించింది. కానీ ఆ తర్వాత ఆమెకు గాయం కావడం విజయావకాశాలను దెబ్బతీసింది. వైద్య బృందం చికిత్స చేసినా కానీ ఫలితం లేకపోయింది. నొప్పితోనే బరిలోకి దిగిన నిషా మీద ఆధిపత్యం చెలాయించిన ప్రత్యర్థి చకాచకా పాయింట్ల సాధించింది.  అయితే ఓటమి అనంతరం నిషా దహియా మ్యాట్‌పైనే కన్నీటిపర్యంతమయ్యింది.