calender_icon.png 16 January, 2025 | 10:31 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టీజీఐఐసీ చైర్మన్‌గా నిర్మల బాధ్యతలు

12-07-2024 12:57:44 AM

అభినందించిన మంత్రులు 

హైదరాబాద్, జూలై 11 (విజయక్రాంతి): రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు గురువారం బాధ్యతలు చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి మండలి చైర్మన్‌గా తూర్పు నిర్మలాజగ్గారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమక్షంలో బషీర్‌బాగ్‌లోని ఐఐసీ భవనంలో నిర్మలా జగారెడ్డి చార్జ్ తీసుకున్నారు. కార్యక్రమానికి పార్టీ ముఖ్య నేతలతో పాటు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. బీసీ కార్పొరేషన్ చైర్మన్‌గా శ్రీకాంత్‌గౌడ్  సంక్షేమ భవన్‌లో బాధ్యతలు స్వీకరించారు. కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చైర్మన్లకు మంత్రులు, కాంగ్రెస్ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. వారి ప్రమాణస్వీకార కార్యక్రమాలకు స్వయంగా హాజరయ్యారు.