calender_icon.png 1 February, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మలమ్మ పద్దుపై గంపెడాశలు

01-02-2025 12:57:31 AM

  1. ఆర్థిక క్రమశిక్షణతో పాటుగా వృద్ధిపై దృష్టి
  2. గ్రామీణ సంక్షేమం, విద్య, వైద్య రంగాలకు మరిన్ని నిధులు
  3. ఈవీ, గ్రీన్ ఎనర్జీ రంగాలకు ప్రోత్సాహకాలు
  4. బ్రిక్‌వర్క్ రిసెర్చ్ సంస్థ అంచనా

హైదరాబాద్, జనవరి ౩౧ (విజయక్రాంతి):  కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను శనివారం పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి సిద్ధమవుతున్న తరు ణంలో వివిధ రంగాలు, భాగస్వాములు బడ్జెట్‌లో లభించబోయే ప్రయోజనాలపై గంపె డన్ని ఆశలు పెట్టుకున్నాయని బ్రిక్‌వర్క్ రిసె ర్చ్ సంస్థ అభిప్రాయపడింది.

ఆర్థిక మం త్రిగా నిర్మలా సీతారామన్‌కు ఇదివరసగా ఎనిమిదో బడ్జెట్ కాగా బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక ప్రవేశపెడుతున్న రెండో బడ్జెట్. 

సంస్కరణల కొనసాగింపు

అయితే పన్ను వసూళ్లు ఆశించిన దానికన్నా మెరుగ్గా ఉండడం, ద్రవ్యలోటు కూ డా ఇంతకుముందు అంచనా వేసిన దానికన్నా తక్కువగా ఉండడం, రుతుపవనాలు బాగా ఉండడంతో వ్యవసాయ దిగుబడి కూడా మెరుగ్గా ఉండే అవకాశాలు ఉండడంతో కీలక రంగాలకు పెట్టుబడులను పెంచడం ద్వారా ఆర్థికవృద్ధిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వానికి వెసులుబాటు లభించనుంది.

అయితే ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణం కారణంగా కుటుంబాల బడ్జెట్‌లు పెరిగిపోయి సామాన్యుల జీవితాలు భారంగా మారుతుండడంతో పాటుగా గ్రామీణ వినియోగం eశించిన స్థాయిలో పెరగక పోవడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది.

ఈ నేపథ్యం లో వేతన జీవులు ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విధంగా ఆదాయం పన్ను చట్టం శ్లాబుల్లో మార్పులు చేయడం ద్వారా ఆయా వర్గాలకు పోత్సాహకాలు అందించడంతో పాటుగా పన్ను చట్టాల్లో సంస్కరణ లను బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. అలాగే ఆహార, ఎరువుల సబ్సిడీలతో పాటుగా గ్రామీణ సంక్షేమ పథకాలకు నిధులను పెంచడం ద్వారా ఆర్థికవృద్ధిని పెంచేందుకు కూడా ఆర్థిక మంత్రి చర్యలు తీసుకోవచ్చని భావిస్తున్నారు.

దీనితో పాటుగా గృహ నిర్మాణం, ఉపాధి కల్పన, విద్య, వైద్య రంగాలకు   కేటాయింపులను మరింతగా పెంచే అవకాశముందని ఆశిస్తున్నారు. ఇక పారిశ్రామిక రంగానికి సంబంధించి ఎలక్ట్రానిక్ వాహన తయారీ , గ్రీన్ ఎనర్జీ రంగాలకు మరిన్ని ప్రోత్సాహకాలను అందించడంతో పాటుగా ‘ఆత్మనిర్భర్ భారత్’ లక్ష్య సాధన దిశగా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని కూడా ఆయా రంగాలు ఆశిస్తున్నాయి.

బడ్జెట్‌కు ముందు రోజు  దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగియడం నిర్మలమ్మ పద్దుపై పరిశ్రమ వర్గాలు ఆశాజనకంగా ఉండడానికి సంకేతంగా భావించవచ్చని ఆ సంస్థ అభిప్రాయపడింది. 

రెండు సవాళ్లు

ఓవైపు ఆర్థిక వివేచనకు కట్టుబడుతూనే ఆర్థికాభివృద్ధిని వేగవంతం చేయ డమనే రెండురకాల సవాళ్లను ఆర్థిక మం త్రి ఎదుర్కొంటున్నారు.ఆర్థిక వృద్ధి మందగించడం తో పాటుగా ప్రపంచ అస్థిరతల నేపథ్యంలో వినియోగాన్ని పెంచే చర్యలు, మూలధన వ్యయానికి మధ్య సమతుల్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై దృష్టిపెట్టడం, ఎంఎస్‌ఎంఈ రంగానికి మద్దతు కొనసాగిం చడం, ఉద్యోగాల కల్పన, ఆర్థిక సుస్థిరతను సాధించడంపై బడ్జెట్ ప్రధానం గా దృష్టిపెట్టవచ్చని భావిస్తున్నారు. 

ఆర్థిక క్రమశిక్షణను కొనసా గించడం,లక్షిత రం గాలపై పెట్టబడులు పెట్టడం ద్వారా ఆర్థిక వృద్ధి పుంజుకునేలా చేయడం, దేశీయ డిమాండ్‌ను పెంచడంతో పాటుగా ప్రైవే టు భాగస్వామ్యాన్ని పెంచడంపై బడ్జెట్ ప్రధానంగా దృష్టి పెట్టే అవకాశం ఉంది.

ద్రవ్యోల్బణం ఒత్తిళ్లు ద్రవ్య విధాన నిర్ణయాలకు అడ్డంకిగా మారుతున్న దృష్ట్యా ద్రవ్య లోటు పెరగకుండా వృద్ధిని వేగవంతం చేయడానికి చర్యలు తీసుకో వాలన్న డిమాండ్లు పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఆకాంక్షలన్నిటినీ బడ్జెట్ ఏమేరకు నెరవేరుస్తుందా అని అన్ని వర్గా లు ఎదురు చూస్తున్నాయి.