calender_icon.png 1 February, 2025 | 3:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

Budget 2025 highlights: ఆదాయ పన్నుపై కేంద్రం కీలక నిర్ణయం

01-02-2025 12:43:49 PM

న్యూఢిల్లీ: విపక్షాల నిరసనల మధ్య పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Union Finance Minister Nirmala Sitharaman) వార్షిక బడ్జెట్-2025-26ను ప్రవేశపెట్టారు. నిర్మలా సీతారామన్ వరుసగా ఎనిమిదోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఎన్డీయే ప్రభుత్వం మూడోదఫా అధికారంలోకి వచ్చాక తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ఇది. త్వరిత, సమ్మిళిత అభివృద్ధి పెట్టుబడుల సాధన లక్ష్యంగా బడ్జెట్-2025(Budget 2025) ను కేంద్రం ప్రవేశపెట్టింది. గత పదేళ్లలో సాధించిన అభివృద్ధే మాకు స్ఫూర్తి, మార్గదర్శి  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. పదేళ్లలో సాధించిన అభివృద్ధి, సంస్కరణలతో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి(Global economic growth) మందగించినా భారత్ మెరుగైన పనితీరు సాధించిందని నిర్మల పేర్కొన్నారు. గురజాడ సూక్తి(Gurajada Sukti)ని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. ‘దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్..’(A nation is not the soil. A nation is the people) అంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో బడ్జెట్ ప్రసంగం ప్రారంభించారు.

ద్రవ్యలోటు 4.8 శాతం

ఆర్థిక లోటు జీడీపీలో 4.4 శాతం ఉంటుందని అంచనా

కేంద్ర బడ్జెట్ 2025-26 కీలక అంశాలు

పది కీలక రంగాలపై ప్రత్యేక దృష్టిలో కేంద్ర బడ్జెట్ 2025-26

రాష్ట్రాల భాగస్వామ్యంతో పీఎం ధన్ ధాన్య యోజన పథకం అమలు

గ్రామీణ ప్రాంతాల నుంచి వలసల నివారణకు ప్రత్యేక కార్యక్రమం

పప్పుధాన్యాల స్వయంసమృద్ధికి 6 ఏళ్ల వ్యవధిలో ప్రత్యేక మిషన్

కూరగాయలు, పండ్ల లభ్యత పెంచేలా ప్రత్యేక సమగ్ర కార్యక్రమం

 పండ్లు, కూరగాయల లభ్యత పెంచేలా రాష్ట్రాలతో కలిసి ప్రత్యేక ప్రాజెక్టు

బిహార్ కేంద్రంగా మఖానా బోర్డు ఏర్పాటు

అధికోత్పత్తి వంగడాల కోసం ప్రత్యేక జాతీయ మిషన్

2024 జులై నుంచి వందకు పైగా అధికోత్పత్తి వంగడాలు విడుదల

పత్తి ఉత్పాదకత పెంచేందుకు జాతీయస్థాయిలో ప్రత్యేక మిషన్

పత్తి రైతులకు మేలు చేసేలా దీర్ఘకాలిక లక్ష్యాలతో జాతీయ పత్తి మిషన్

7.74 కోట్ల రైతులకు స్పల్పకాలిక రుణాల కోసం కిసాన్ క్రెడిట్ కార్డులు

యూరియా ఉత్పత్తిలో స్వయంసమృద్ధికి కొత్త కర్మాగారాలు

ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చే పది సూత్రాల్లో రెండోది ఎంఎస్ఎంఈ రంగం

ఎగుమతుల్లో 45 శాతం వరకు ఎంఎస్ఎంఈల భాగస్వామ్యం

ఎంఎస్ఎంఈలకు వచ్చే ఐదేళ్లలో రూ. 1.5 లక్షల కోట్లు.

27 రంగాల్లో స్టార్టప్ లకు రుణాల కోసం ప్రత్యేక కార్యాచరణ

నమోదు చేసుకున్న సూక్ష్మ సంస్థలకు రూ. 5 లక్షలతో క్రెడిట్ కార్డు

సూక్ష్మ సంస్థలకు తొలి ఏడాది 10 లక్షల వరకు క్రికెడ్ కార్డులు

ఎంఎస్ఎంఈలకు రూ. 10 వేల కోట్లతో ఫండ్ ఆఫ్ ఫండ్ ఏర్పాటు

బొమ్మల తయారీలో దేశాన్ని ప్రపంచస్థాయిలో నిలిపేలా ప్రత్యేక కార్యక్రమం

మేడిన్ ఇండియా బ్రాండ్ కింద బొమ్మల తయారీకి ప్రత్యేక ప్రోత్సాహం

బిహార్ లో నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ,ఆంత్రపెన్యూర్ షిప్

ఆర్థిక రంగానికి మూడో ఇంజిన్ గా పెట్టుబుడలు.

8 కోట్ల మంది చిన్నారులు, కోటి మంది బాలింతల కోసం అంగన్ వాడీ 2.0

దేశవ్యాప్తంగా 50 వేల పాఠశాలల్లో అటల్ టింకరింగ్ ల్యాబ్ ల ఏర్పాటు

క్లీన్ టెక్ మిషన్ కింద సోలార్, ఈవీ, బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహం

పరిశ్రమలకు ప్రోత్సాహం కోసం నేషనల్ మానుఫ్యాక్చరింగ్ మిషన్

రూ. 30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్ట్ క్రెడిట్ కార్డులు

వచ్చే ఐదేళ్లలో దేశవ్యాప్తంగా 75 వేల కొత్త మెడికల్ సీట్లు

దేశవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డే కేర్ క్యాన్సర్ సెంటర్లు

సంస్కరణలకు ప్రోత్సాహంగా రాష్ట్రాలకు 5 ఏల్ల వ్యవధిలో వడ్డీ లేని  రుణాలు

జల్ జీవన్ మిషన్ కింద 15 కోట్ల మందికి రక్షిత మంచినీరు అందించాం

 ప్రతి ఇంటికి రక్షిత మంచినీరు అందించేందుకు మరిన్ని నిధులు

రాష్ట్రాలు, యూటీలతో ఒప్పందం ద్వారా 100 శాతం మంచినీటి కుళాయిలు

పీఎం ఆరోగ్య యోజన కింద గిగ్ వర్కర్ల కోసం హెల్త్ కార్డులు

గిగ్ వర్కర్ల నమోదు, ఐడీ కార్డుల కోసం ప్రత్యేక ఆన్ లైన్ వేదిక 

చిన్నస్థాయి అనురియాక్టర్ల కోసం జాతీయ అణుశక్తి మిషన్

ఉడాన్ పథకం ద్వారా 120 కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు 

వచ్చే పదేళ్లలో 4 కోట్ల మంది కొత్త ప్రయాణికులకు సౌకర్యం

 బిహార్ కొత్త గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టు

పాట్నా ఎయిర్ పోర్టు అభివృద్ధికి చర్యలు

దేశవ్యాప్తంగా పెట్టుబడులు ఉపసంహరణ, ఆస్తుల విక్రయానికి రెండో ప్రణాళిక

రూ. 25 వేల కోట్లతో నేషనల్ మారిటైమ్ ఫండ్ ఏర్పాటు

ప్రభుత్వం, ప్రవేటు, పోర్టుల భాగస్వామ్యంతో మారిటైమ్ మిషన్

వృద్ధి కేంద్రాలుగా పట్టణాలు అభివృద్ధికి రూ. లక్ష కోట్లతో ప్రత్యేక మిషన్

కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ. 3 లక్షల నుంచి  రూ. 5 లక్షలకు పెంపు

2047 నాటికి 100 గిగావాట్ల అణు విద్యుత్ ఉత్పత్తి లక్ష్యం

రూ. 20 వేలకోట్లతో నేషనల్ న్యూక్లియర్ ఎనర్జీ మిషన్

2030 నాటికి నాలుగు చిన్న, మధ్యస్థాయి రియాక్టర్ల ఏర్పాటు 

ఎంఎస్ఎంఈలకు రూ, 20 కోట్ల వరకు టర్మ్ రుణాలు

దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రాంతాలు ప్రత్యేకంగా అభివృద్ధి

మిథిలాంచర్ ప్రాంతంలో పశ్చిమ కోసం కాలువ నిర్మాణం

 ప్రైవేటు భాగస్వామ్యంతో మెడికల్ టూరిజంపై అదనపు శ్రద్ధ

మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనలు సులభతరం

విద్యుత్ రంగంలో సంస్కరణల కోసం పంపిణీ సంస్థలకు ప్రోత్సాహకాలు

 విద్యుత్ సంస్కరణలకు కీలకంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యం

వర్థమాన ద్వితీయ శ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు ప్రత్యేక ప్రోత్సాహం

ఉద్యాన పంటల ఉత్పత్తుల రవాణకు ప్రత్యేక కార్యక్రమం

 షిప్ బిల్డింగ్ కోసం కొత్త ఎకో సిస్టమ్ ఏర్పాటు

ఐఐటీ, ఐఐఎస్ విద్యార్థులకు రూ. 10 వేల కోట్ల ఉపకార వేతనాలు

 జ్జానభారత విషన్ ఏర్పాటు

మ్యూజియాలు, ప్రైవేటు వ్యక్తుల వద్ద పూరాతత్వ ప్రతుల పునరుద్ధరణకు సాయం

 ఎగుమతులు పెంచేలా ఎంఎస్ఎంఈ వాణిజ్య శాఖల ద్వారా ప్రత్యేక ఏర్పాటు

ఎగుమతుల డాక్యుమెంటేషన్ విషయంలో సహాయం

ఎగుమతులకు ఉద్దేశించిన ప్రత్యేక వస్తువులకు అదనపు సాయం

పట్టణ స్థానిక సంస్థలకు ఆర్థిక చేయూతకు ప్రత్యేక నిదులు

 స్వయం సహాయ బృందాల కోసం గ్రామీణ్ క్రెడిట్ స్కోర్ నెట్ వర్క్

భవిష్యత్ ఆహారభద్రత కోసం రెండో జన్యు బ్యాంకు ఏర్పాటు

బీమా రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి

ద్వితీయశ్రేణి నగరాల్లో జీసీసీల ఏర్పాటుకు రాష్ట్రాలకు సహాయం

 పండ్లు, కూరగాయల ఎగుమతుల కోసం ప్రత్యేక కార్గో సౌకర్యం

వచ్చేవారం  పార్లమెంటు ముందుకు ప్రత్యేక వ్యక్తిగత ఆదాయపన్ను బిల్లు.

క్యాన్సర్, తీవ్రవ్యాధులకు వాడే 37 ఔషధాలపై కేంద్రం దిగుమతి సుంకం తొలగిస్తూ ప్రకటన చేసింది. ఆరు రకాల ప్రాణావసర ఔషధాలపై దిగుమతి సుంకం పూర్తిగా రద్దు చేసింది. ఔషధాలకు అమసరమైన బల్క్ డ్రగ్స్ దిగుమతులపై సుంకాన్ని తొలగించింది. వ్యక్తిగత ఆదాయపన్నుపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ, 12 లక్షల వరకు వ్యక్తిగత ఆదాయ పన్ను నుంచి మినహాయించింది. రూ. 18 లక్షల వరకు ఆదాయం వచ్చేవారికి రూ. 70 వేల వరకు లబ్ధి చేకూరుతుంది. రూ. 25 లక్షల వరక ఆదాయం వచ్చేవారికి రూ. 1.10 లక్షల వరకు లబ్ధి చేకూరుతోంది. పాతపన్ను విధానంలో రూ. 4 లక్షల వరకూ పూర్తి పన్ను మినహాయింపు, పాత పన్ను విధానంలో రూ. 4 లక్షల నుంచి 8 లక్షల ఆదాయంపై 5 శాతం పన్ను, రూ. 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఆదాయంపై 10 శాతం పన్ను, రూ. 12 లక్షల నుంచి 16 లక్షల ఆదాయంపై 15 శాతం పన్ను, రూ. 16 లక్షల నుంచి 20 లక్షల ఆదాయంపై 20 శాతం పన్ను ఉండేది.