నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న నిర్మల్ ఉత్సవాలు-2025 మూడో రోజు అయిన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర మాజీ మంత్రి ఏ ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్(Collector Abhilasha Abhinav), అదనపు కలెక్టర్లు కిషోర్ కుమార్, ఫైజాన్ ఆహ్మద్ తదితరులు హాజరయ్యారు. ఉత్సవాలను ప్రదర్శనలను వారు పరిశీలించి నిర్మల్ ఉత్సవాల చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకునే విధంగా నిర్మల్ లో నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూప ప్రదర్శనలు ప్రజలను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు కళాకారులు పాల్గొన్నారు.