చివరిరోజు ఆకట్టుకున్న కళా ప్రదర్శనలు
నిర్మల్, జనవరి 8 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో తొలిసారి నిర్వహించిన నిర్మల్ ఉత్సవాలు-2025 బుధవారం రాత్రి వైభవంగా ముగిశాయి. నాలుగు రోజు ల పాటు కలెక్టర్ అభిలాష అభినవ్ ప్రత్యేక శ్రద్ధతో ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలను విజయవంతం చేయడానికి సహకరిం చిన ప్రతి ఒక్కరికి కలెక్టర్ కృతజ్ఞతలు తెలిపారు.
రానున్న రోజుల్లోనూ ఇలాంటి కార్య క్రమాలు చేపట్టేందుకు ప్రతి ఒక్కరు సహక రించాలని కలెక్టర్ కోరారు. నిర్మల్ ఉత్సవాల ను నాలుగు రోజులపాలు అధిక సంఖ్యలో ప్రజలు, యువత తరలివచ్చి అనేక చారిత్రక విషయాలను తెలుసుకున్నారని కలెక్టర్ చె ప్పారు. కాగా చివరి రోజైన బుధవారం నిర్వహించిన పలు కళా ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, ఫైజాన్ అహ్మద్ పాల్గొన్నారు.