calender_icon.png 7 January, 2025 | 2:49 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిర్మల్ ఉత్సవాలు షురూ

06-01-2025 12:15:14 AM

ప్రాంభించిన కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, జనవరి 5 (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో ఆదివారం నిర్మల్ ఉత్సవాలు ఘ నంగా ప్రారంభమయ్యాయి. కలెక్టర్ అభిలా ష అభినవ్, అదదనపు కలెక్టర్లు కిశోర్‌కుమార్, పైజాన్ అహ్మద్ ప్రారంభించారు. నిర్మల్ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, ఆహార అలవాట్లు, చారిత్రక ప్రదేశాలు, కట్టడాలు, కళల గురిం చి నేటి తరానికి తెలిసేలా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధతో మూడురోజుల నిర్మల్ ఉత్సవాలను ప్రారంభించారు.

ఇందులో మొత్తం 50 స్టా ల్స్ ఏర్పాటు చేసి, ప్రభుత్వ, ప్రవేటు  సంస్థల ఆధ్వర్యంలో వారు తయారు చేసిన ఉత్పత్తులు ఏర్పాటు చేశారు. నిర్మల్ కొయ్యబొ మ్మలు, పాఠశాల విద్యార్థులు తయారు చేసిన వస్తువులు, గిరిజనులు ఉత్పత్తి చేస్తు న్న తేనే, ఇప్పలడ్డు, డీఆర్డీవో మహిళా సంఘాల ద్వారా బుట్టలు,  వంటకాలు, జొ న్నరొట్టె, పిట్ల, విజయ డెయిరీ ఉత్పత్తులు, ఉద్యాన వనం మొక్కలు, దుస్తులు, వ్యవసాయ ఉత్పత్తులు, సేంద్రియ పంటల ఉత్పత్తులు, కృత్రిమ నీటి కొలను, గన్స్, ఆట వస్తువులు, నిర్మల్‌కు చెందిన కవులు, రచయితలు రాసిన పుస్తకాలు, జిల్లా చరిత్ర, దేవాలయాలు, కట్టడాల గురించి తెలిపే స్క్రీన్ పదర్శన తదితర ఆంశాలకు సంబంధించి పదర్శలను ఏర్పాటు చేశారు. వాటి గురించి తెలిపేందుకు గైడ్‌లను ఏర్పాటు చేశారు.

సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో డీఆర్వో రత్నకళ్యాణి, అధికారులు పాల్గొన్నారు.