18-02-2025 05:00:01 PM
ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా, ఆర్డీవో రత్న కళ్యాణి మంగళవారం ఖానాపూర్ పట్టణంలోని పోలింగ్ బూత్లను పరిశీలించారు. రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల కోసం, పట్టణంలోని జూనియర్ కళాశాల పోలింగ్ బూత్ ను సందర్శించి, ఏర్పాట్లను సమీక్షించారు. అనంతరం ఉన్నత పాఠశాల విద్యార్థులని సందర్శించి, రానున్న పదవ తరగతి పరీక్షల్లో అధిక శాతం ఉత్తీర్ణత సాధించాలని, విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆమె వెంట ఖానాపూర్ తహసిల్దార్ సుజాత, ఆర్ ఐ నగేష్ లు ఉన్నారు.