calender_icon.png 1 April, 2025 | 4:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్ర స్థాయి అవార్డు అందుకున్న నిర్మల్ వైద్యురాలు

29-03-2025 07:02:44 PM

భైంసా (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని దేవిబాయి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూ చెందిన డాక్టర్ చంద్రిక అవినాష్ రాష్ట్ర స్థాయిలో గైనకాలజి, ఇన్ఫర్టిలిటీ విభాగంలో డాక్టర్స్ ఎక్సెలెన్స్ అవార్డు అందుకున్నారు. ఎంపీ శ్రీ.రఘునందన్ రావు, రాష్ట్ర మహిళా కమిషన్ అధ్యక్షురాలు శ్రీ నేరెళ్ల శారద చేతుల మీదుగా అవార్డు హైద్రాబాద్ లో స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు రావడం చాలా సంతోషంగా ఉందని తనపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. తనని ప్రోత్సహించి ఆదరిస్తున్న అభిమానులకు పేషెంట్లకు హాస్పిటల్ సిబ్బందికి డాక్టర్ కృతఙ్ఞతలు తెలిపారు.