calender_icon.png 20 April, 2025 | 8:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజాయితీ చాటుకున్న నిర్మల్ కండక్టర్

20-04-2025 05:13:05 PM

నిర్మల్ (విజయక్రాంతి): జగిత్యాల నుండి నిర్మల్ కు ప్రయాణిస్తున్న జగిత్యాల వాసి గుగ్గిల మనోజ్ఞ నిర్మల్ డిపో బస్సు TS18T 4456 లో చేతి పర్సు సీటుపై పెట్టి మరిచిపోయారు. డిపోలో బస్సును అప్పగించేటప్పుడు కండక్టర్ శ్యామల 851334 కు పర్సు కనబడింది. డిపో క్లర్క్ కు అప్పగించారు. అందులో 20000/- రూ..ల విలువచేసే చెవి కమ్మలు ఉన్నాయి. ప్రయాణికురాలిని డిపోకు పిలిపించి డిపో క్లర్క్ ఎన్. ఆర్ శేఖర్ అప్పచెప్పడం జరిగింది. నిజాయితీగా బంగారాన్ని అప్పచెప్పిన కండక్టర్ డ్రైవర్ లను డిపోమేనేజర్ కే.పండరి అభినందించారు.