06-04-2025 05:57:25 PM
భైంసా (విజయక్రాంతి): భైంసా-నిర్మల్ బస్సులో విధులు నిర్వహిస్తున్న ఓ కండక్టర్ తన నిజాయితీని చాటుకున్నారు. ఓ ప్రయాణికురాలు ఆదివారం బస్సులో ప్రయాణిస్తుండగా రూ.10 వేల నగదు ఉన్న పర్సును బస్సులో మర్చిపోయారు. ఇట్టి డబ్బుల పర్సును కండక్టర్ నారాయణకు లభించింది. పర్సులో ఉన్న ఫోన్ నెంబర్ ఆధారంగా సంబంధిత ప్రయాణికురాలికి సమాచారం అందించి దానిని బాధితురానికి అందజేశారు. నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ సిబ్బందిని డిపో మేనేజర్ కే.పండరి, అసిస్టెంట్ మేనేజర్ ఐ. రాజశేఖర్ పలువురు అభినందించారు.