calender_icon.png 27 November, 2024 | 6:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇథనాల్ ఫ్యాక్టరీ పనులకు బ్రేక్.. దిగొచ్చిన సర్కార్

27-11-2024 03:29:09 PM

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో రైతుల ఆందోళనకు కాంగ్రెస్ ప్రభుత్వం దిగొచ్చింది. ఇథనాల్ పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. దిలావర్ పూర్ గ్రామస్థులతో కలెక్టర్ అభినవ్ చర్చలు జరిపారు. నిన్నటి ఘటనపై ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు కలెక్టర్ వెల్లడించారు. సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు గ్రామస్థులకు కలెక్టర్ తెలిపారు. పరిశ్రమ పనులు నిలిపివేయాల్సిందిగా తాజాగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు.

నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ పరిశ్రమ అనుమతులను ప్రభుత్వం పరిశీలిస్తుంది. గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన అనుమతులు పున: సమీక్షించాలని నిర్ణయం తీసుకుంది. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన చర్యలను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అవసరమైతే ఇథనాల్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని తెలంగాణ సర్కార్ యోచిస్తోంది. దిలావర్‌పూర్‌లో రైతులు  పోలీసులకు ఎదురుతిరిగారు. పోలీసుల మీద రాళ్ళు రువ్వుతూ, పురుగుల మందు డబ్బాలతో నిరసన చేపట్టారు.