06-03-2025 12:00:00 AM
నిర్మల్ మార్చ్ 5 (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో మున్సిపల్ రెవిన్యూ అధికారులు పన్నులు చెల్లించని వ్యాపార వాణిజ దుకాణాలపై బుధవారం కొరడా దుళిపించారు. నిర్మల్ క్లబ్ కు చెందిన మున్సిపల్‌కి చెల్లించవలసిన బకాయి సుమారు 9 లక్షలు ఉండడంతో ఇదివరకే మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేయగా పనులు చెల్లించకపోవడంతో మున్సిపల్ రెవిన్యూ అధికారి అనూప్ ఆధ్వర్యంలో 20 వ్యాపార దుకాణాలను సీజ్ చేసినట్టు మున్సిపల్ అధికారులు తెలిపారు. పన్నులు చెల్లించి తమకు సహకరించాలని వారు కోరారు.