calender_icon.png 23 December, 2024 | 11:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలను ఇంకా ఎందుకు ప్రారంభించలేదు..?

16-10-2024 01:42:13 PM

ప్రభుత్వ పెద్దలకు తెలియదా?

హైదరాబాద్: దళారుల చేతుల్లోకి పత్తి వెళ్లాలనే దురుద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలు పెట్టలేదని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మీడియాతో అన్నారు. పత్తి రైతు నిల్వ ఉంచుకోలేడని తెలిసే ఇవ్వన్నీ చేస్తున్నారని ఆరోపించారు. విధి లేని పరిస్థితుల్లో పత్తిని తక్కువ ధరకే అమ్ముకుంటున్నారని నిరంజన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సీసీఐ కొనుగోలు కేంద్రాలు ఇంకా ఎందుకు ప్రారంభించలేదు..?, ఆలస్యమైతే ఏం జరుగుతుందో ప్రభుత్వ పెద్దలకు తెలియదా..? అని ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగా వస్తే పత్తి రైతులు బాగా నష్టపోతారని సూచించారు. గుజరాత్ రైతులకు ఎక్కువ ధర ఇస్తున్నారు.. మన రైతులకు తక్కువ ధర ఇస్తున్నారని మాజీ మంత్రి ఆగ్రహం వ్యక్త ం చేశారు.