వనపర్తి,(విజయక్రాంతి): పశువుల దవాఖానా పేరుతో ఇంటికి దారిలేకుండా గోడకట్టడంతో సీఎం సొంతూరు వంగూర్ మండలం కొండారెడ్డిపల్లి మాజి సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై మాజి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. మాజి సర్పంచ్ సాయిరెడ్డి ఆత్మహత్యకు ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం భాధ్యత వహించాలన్నారు. గోటితో పోయే సమస్యలను గొడ్డలి దాకా తెస్తున్నారని సాయిరెడ్డి ఆత్మహత్యకు కారకులైన వారందరి మీదా చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పాలనలో మనుషుల ప్రాణాలకు, వారి ఆకాంక్షలకు విలువ లేకుండా పోయిందన్నారు.