పకడ్బందీగా డాటా ఎంట్రీ చేపట్టండి
కలెక్టర్ రాహుల్‌రాజ్
మెదక్, నవంబర్ 22(విజయక్రాంతి): మెదక్ జిల్లాలో 91.31 శాతం కుటుంబ సర్వే పూర్తయిందని, జిల్లావ్యాప్తంగా 2,04,624 కుటుంబాలకు సంబంధించిన వివరాలను సేకరించామని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. సమగ్ర కుటుంబ సర్వే డాటా ఎంట్రీ నిర్వహణ విషయమై శుక్రవారం ఆయన ప్రత్యేక అధికారులు, సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కుటుంబ సర్వేను అత్యంత పారదర్శకంగా నిర్వహించామని, తుది దశకు సర్వే చేరుకుందని తెలిపారు.
డాటా ఎంట్రీలో సంబంధిత కంప్యూటర్ ఆపరేటర్లకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు 369 కంప్యూటర్ ఆపరేటర్లను నియమించుకొని డాటా ఎంట్రీ కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు.