calender_icon.png 26 October, 2024 | 5:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళితులపై దాడి కేసులో 98 మందికి జీవితఖైదు

26-10-2024 01:45:55 AM

కర్ణాటక సెషన్స్ 

కోర్టు చరిత్రాత్మక తీర్పు

బెంగళూరు, అక్టోబర్ 25: కర్ణాటకలోని కొప్పాల్ సెషన్స్ కోర్టు గురువా రం చరిత్రాత్మక తీర్పు ఇచ్చింది. కుల గొడవలతో సంబంధం ఉన్న 98 మంది దోషులకు జీవిత ఖైదు విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ముగ్గురికి ఐదేళ్ల జైలు విధిస్తూ.. దోషులందరికీ రూ.5వేల జరిమానా విధించింది. 2014 ఆగస్టులో కొప్పాల్ లోని మరకుంబికి చెందిన అగ్రవర్ణాల ప్రజలు దళితులును హోటళ్లకు, బార్బ ర్ షాప్‌లకు రానివ్వకపోవడంతో గొడ వ ప్రారంభమైంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత మరోసారి ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంజునాథ్ అనే వ్యక్తి తాను సినిమా చూసి వస్తుండగా దళితులు దాడి చేశారని పేర్కొనడంతో అగ్రవర్ణాల వాళ్లు ఆగ్రహానికి లోనయ్యారు. దళితుల ఇళ్లపై దాడులు చేసి నిప్పంటించారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగనప్పటికీ ఆస్తి నష్టం జరిగింది.