calender_icon.png 29 December, 2024 | 3:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తొమ్మిదో గేమ్ డ్రా

06-12-2024 12:42:40 AM

ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్

సింగపూర్: ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ టోర్నీలో డ్రాల పర్వం కొనసాగుతూనే ఉంది. భారత గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్, చైనా గ్రాండ్‌మాస్టర్ డింగ్ లిరెన్ మధ్య జరిగిన తొమ్మిదో గేమ్ కూడా డ్రాగా ముగిసింది. గేమ్‌లో తెల్ల్ల పావులతో ఆడిన గుకేశ్ 54 ఎత్తుల వద్ద లిరెన్‌తో డ్రా చేసుకున్నాడు. దీంతో ఇద్దరి ఖాతాలో చెరో 0.5 పాయింట్లు జమయ్యాయి. దీంతో 9 గేముల తర్వాత గుకేశ్, లిరెన్ చెరో 4.5 పాయింట్లతో సమంగా ఉన్నారు. విజేతగా నిలవడానికి మరో 3 పాయింట్లు అవసరం కాగా ఐదు గేములు మిగిలి ఉన్నాయి. నేడు ఆటకు విరామం కాగా పదో రౌండ్ శనివారం జరగనుంది. తొలి గేమ్‌ను లిరెన్ గెలవగా.. మూడో గేమ్‌ను గుకేశ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.