- మహిళల టీ20 ప్రపంచకప్
- భారీగా పెరిగిన ప్రైజ్‌మనీ
దుబాయ్: మహిళల టీ20 ప్రపంచకప్‌కు సంబంధించిన ప్రైజ్‌మనీని అంతర్జా తీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) భారీగా పెంచింది. వచ్చే నెలలో యూఏఈ వేదికగా జరగనున్న ప్రపంచకప్ మొత్తం ప్రైజ్‌మనీ 7.95 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.66 కోట్లు). గతంతో పోలిస్తే ఇది 225 శాతం అధికం కావడం విశేషం. ఇక విజేతగా నిలిచిన జట్టు 2.34 మిలియన్ డాలర్లు ( రూ. 19 కోట్ల 60 లక్షలు) అందుకోనుండగా.. రన్నరప్‌కు 1.17 మిలియన్ డాలర్లు (రూ. 9 కోట్ల 80 లక్షలు) అందనుంది. ఇక సెమీఫైనలిస్ట్‌లకు చెరో 675,000 డాలర్లు (రూ. 5 కోట్ల 65 లక్షలు) అందనుంది.
ఇక గ్రూప్ స్టేజీలో వెనుదిరిగే ఆరు జట్లు 1.35 మిలియన్ డాలర్లు (రూ. 11 కోట్లు) పంచుకోనున్నాయి. జూన్‌లో జరిగిన పురుషుల టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన టీమిండియా అందుకున్న ప్రైజ్‌మనీ 2.45 మిలి యన్ డాలర్లు (దాదాపు రూ. 20 కోట్లు) అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మహిళల టీ20 ప్రపంచకప్‌లోనూ ఆయా జట్లకు పురుషులతో సమానంగా ప్రైజ్‌మనీ ఇవ్వనుండడం చెప్పుకోదగ్గ అంశం.
వాస్తవానికి ఈ ఏడాది పొట్టి ప్రపంచకప్‌కు బంగ్లాదేశ్ ఆతిథ్యమివ్వాల్సింది. కానీ దేశంలో నెలకొన్న కల్లోలం కారణంగా ఐసీసీ వేదికను యూఏఈకి మార్చింది. అక్టోబర్ 3 నుంచి 20 వరకు టోర్నీ జరగనుంది. గ్రూప్ భారత్, పాకిస్థాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, శ్రీలంక.. గ్రూప్ సౌతాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్‌లు ఉన్నాయి. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో భారత్ తొలి మ్యాచ్ ఆడనుంది.