28-04-2025 01:03:53 AM
జనాల్లోకి దూసుకెళ్లిన కారు
ఒట్టావా, ఏప్రిల్ 27: కెనడాలోని వాంకోవర్ సిటీలో లపూ లపూ పండుగ జరుగుతున్న సమయంలో ఓ కారు జనాల మీదకి దూసుకెళ్లింది. దీంతో తొమ్మిది మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనకు బాధ్యుడైన కారు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
తొమ్మిది మంది మృతి విషయాన్ని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని స్థానిక పోలీసులు వెల్లడించారు. ఘటన తర్వాత ఆ ప్రాంతమంతా భీతావహంగా మారింది.