calender_icon.png 20 March, 2025 | 8:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చిన్నారుల విక్రయ కేసులో 9 మంది అరెస్టు

20-03-2025 02:27:35 AM

10 మంది చిన్నారులను కాపాడిన రాచకొండ పోలీసులు

ఎల్బీనగర్, మార్చి 19: చిన్నారుల విక్రయ కేసులో తొమ్మిది మంది అంతర్రాష్ట ముఠాను రాచకొండ పోలీసులు అరెస్టు చేశారు. ఎల్బీనగర్‌లోని క్యాంప్ ఆఫీస్‌లో బుధవారం సమావే శంలో రాచకొండ సీపీ సుధీర్‌బాబు వివరాలు వెల్లడించారు. ప్రధాన నిందితురాలు అమూ ల్య ముఠా ఇతర రాష్ట్రాల్లో మొత్తం 25 మంది శిశువులను విక్రయించినట్టు తెలిసింది. గతం లో నలుగురు పిల్లలను పోలీసులు కాపాడగా.. ఇప్పుడు 10 మందిని రక్షించారు.

మరో 11 మంది చిన్నారులను గుర్తించాల్సి ఉంది. హైదరాబాద్‌లోని మలక్‌పేటలో ప్రధాన నిందితు రాలు అమూల్య నివాసం ఉంటున్నది. 10వ త రగతి వరకు చదివి, ఆశా కార్యకర్తగా పని చేస్తున్నది. ఈమె ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వతా భర్త నుంచి దూరంగా ఉంటున్నది. అమూల్య ఆశా వర్కర్‌గా పని చేసే క్రమంలో మధ్యవర్తి ఇస్మాయిల్‌తో పరిచయం ఏర్పడింది.

మలక్‌పేట లోని ఏరియా దవాఖానలో ఇస్మాయిల్ సూపర్‌వైజర్‌గా పని చేసేవాడు. సులభంగా డబ్బు సంపాదించడానికి పిల్లలను విక్రయించాలని అమూల్యను ప్రేరేపించాడు. ఈ క్రమంలోనే అమూల్యకు కోలా కృష్ణవేణి, దీప్తితో పరిచ యం ఏర్పడింది. అప్పటినుంచి అమూల్య శిశువులను సంతానం లేని దంపతులకు మూఠా తో కలిసి విక్రయించేది.

హైదరాబాద్‌లో ఫిబ్రవరి నెలలో ఒక చిన్నారి అదృశ్యమైన కేసు దర్యాప్తు చేస్తుండగా పిల్లలను విక్రయిస్తున్న మూఠాను రాచకొండ పోలీసులు పట్టుకున్నా రు. కోలా కృష్ణవేణి, దీప్తి చెప్పిన విషయాల ఆ ధారంగా ప్రధాన నిందితురాలు అమూల్యతో పాటు మరో తొమ్మిది మందిని బుధవారం అదుపులోకి తీసుకున్నారు. పిల్లలను దత్తతకు తీసుకున్న తల్లిదండ్రులనూ అరెస్టు చేశారు.