calender_icon.png 11 February, 2025 | 6:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మణిపూర్‌లో తొమ్మిది మంది ఉగ్రవాదులు అరెస్ట్

11-02-2025 11:04:53 AM

ఇంఫాల్: మణిపూర్‌లోని ఇంఫాల్ వెస్ట్, తెంగ్నౌపాల్ జిల్లాలకు చెందిన తొమ్మిది మంది ఉగ్రవాదులను(militants) భద్రతా బలగాలు(Security forces) అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. నిషేధిత సంస్థ కంగ్లీపాక్ కమ్యూనిస్ట్ పార్టీ (అపున్బా)కి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను ఇంఫాల్ వెస్ట్ జిల్లా(Imphal West District)లోని రూపమహల్ ట్యాంక్ ప్రాంతంలో సోమవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రూపమహల్ ట్యాంక్ ప్రాంతంలో దోపిడీ కార్యకలాపాలకు పాల్పడ్డారు. మరో ఆపరేషన్‌లో, తెంగ్నౌపాల్ జిల్లాలోని సరిహద్దు స్తంభం 85 నుండి నిషేధిత సంస్థలైన యునైటెడ్ నేషనల్ లిబరేషన్ ఫ్రంట్ (United National Liberation Front), PREPAKకి చెందిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు ఆదివారం అరెస్టు చేశాయి.

తెంగ్నౌపాల్ జిల్లాలోని ఎల్ మినో రిడ్జ్‌లైన్ నుండి నిషేధిత (తైబంగన్‌బా) గ్రూపుకు చెందిన ఐదుగురు సభ్యులను భద్రతా దళాలు అరెస్టు చేసినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు. ఆదివారం అరెస్టు చేసిన ఐదుగురు ఉగ్రవాదుల నుంచి 14 మ్యాగజైన్‌లు, మందుగుండు సామాగ్రి, ఇతర వస్తువులతో పాటు ఒక ఎల్‌ఎంజి రైఫిల్, ఒక ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్, రెండు ఐఎన్‌ఎస్‌ఎఎస్ రైఫిల్స్, ఎకె 47 రైఫిల్‌లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. చురచంద్‌పూర్ జిల్లాలోని కౌన్‌పుయ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తిని ఆదివారం పోలీసులు ఆయుధాల అక్రమ రవాణాకు పాల్పడ్డారు. అతని వద్ద నుంచి ఒక కోల్ట్ 7.65 ఎంఎం ఆటో పిస్టల్, 9 ఎంఎం పిస్టల్, మూడు మ్యాగజైన్‌లు, 16 వేర్వేరు మందుగుండు సామగ్రి, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.