చార్మినార్ (విజయక్రాంతి): సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అంతర్‌రాష్ట్ర గంజాయి నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి తొమ్మిది కిల్లోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రెండు సెల్‌ఫోన్‌లు సీజ్ చేశారు. అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపిన వివరాల ప్రకారం.. చందన్‌మాఝీ(36), బిజయతక్రి (51) అనే ఇద్దరు వ్యక్తులు బండ్లగూడలో ఓ కళాశాల విద్యార్థులకు గంజాయిని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా విశ్వసనీయ సమాచారం మేరకు సౌత్, ఈస్ట్ పోలీసులు, బండ్లగూడ పోలీసులు సంయుక్తంగా దాడి చేసి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. వారి వద్ద నుంచి రూ.3లక్షల విలువైన గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు డీసీపీ అందె శ్రీనివాసరావు మాట్లాడుతూ.. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాధించాలనే కోరికతో బిజయతక్రి ఒడిశా మాచిఘటి నుండి బోలు అనే వ్యక్తి నుంచి 15 వేలకు తొమ్మిది కిల్లోల గంజాయిని కొనుగోలు చేసి హైదరాబాద్‌లో నివసించే అతని స్నేహితుడు బిస్వజిత్ చందన్‌కు అందజేయడంతో జరుగుతుందన్నారు. గుట్టుచప్పుడు కాకుండా చందన్‌మాఝీ, బిజియతక్రి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. కేసును బండ్లగూడ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.