calender_icon.png 11 October, 2024 | 10:02 PM

హీరో మోటార్స్ నుంచి 900 కోట్ల ఐపీవో

25-08-2024 12:30:00 AM

న్యూఢిల్లీ, ఆగస్టు 24: హీరో మోటార్స్ కంపెనీ (హెచ్‌ఎంసీ) గ్రూప్‌నకు చెందిన ఆటోమొబైల్ విడిభాగాల తయరీ సంస్థ హీరో మోటార్స్ రూ.900 కోట్ల సమీకరణకు ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో)ను జారీచేసేందుకు సిద్ధమవుతున్నది. ఇందుకోసం కంపెనీ శనివారం మార్కెట్ రెగ్యులేటర్ వద్ద ముసాయిదా ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేసింది. ఐపీవోలో రూ. 400 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీచేయనుండగా, రూ.250 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్‌ఎస్) మార్గంలో ప్రమోటర్లు విక్రయిస్తారు.

తాజా ఈక్విటీ జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ. 202 కోట్లు రుణాల చెల్లింపునకు, మరో రూ.124 కోట్లు విస్తరణ ప్రాజెక్టుకు అవసరమైన ఎక్విప్‌మెంట్ కొనుగోలుకు వినియోగిస్తుంది. భారత్‌తో సహా యూఎస్, యూరప్, ఆసియా ప్రాంతంలోని ఆటోమొటివ్ ఓఈఎంలకు వివిధ వాహనాల్లో ఉపయోగించే ఎలక్ట్రిక్, నాన్ ఎలక్ట్రిక్ పవర్ ట్రైన్స్‌ను హీరో మోటార్స్ సరఫరా చేస్తుంది. 2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ.1,064 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.