భీమదేవరపల్లి, డిసెంబరు 22: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామంలోని గద్దలబండపై పంచముఖ ఆంజనేయస్వామి సన్నిధిలో ఆదివా రం 963 మంది మహిళలు హనుమాన్ చాలీసా పఠిస్తూ కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఢీల్లీ నుంచి వరల్డ్ రికార్డు కో ఆర్డినే టర్ వెంకటరామారావు వచ్చి ప్రదర్శన వీక్షించారు. పంచముఖ ఆంజనేయస్వామి దేవాలయం, తపస్వీ డ్యాన్స్ అకాడమీ నిర్వాహకులు శ్వేత సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంతో నేషనల్ స్ప్రిచ్యువల్ వరల్డ్ రికార్డులో స్ప్రిచ్యువల్ చోటు దక్కింది.
కార్య క్రమంలో ఆలయ వ్యవస్థాపకులు కాసం రమేశ్‌స్వరూప, మాజీ జడ్పీటీసీ గద్ద రాజమణిసమ్మయ్య, మాజీమంత్రి పెద్దిరెడ్డి, వంగ రవిందర్, కొమురవెళ్లి చంద్రశేఖర్‌గుప్తా, బొజ్జపురి అశోక్‌ముఖర్జీ, జూకల్ సాయిరెడ్డి, గూటం జోగిరెడ్డి, గద్ద సంపత్ పాల్గొన్నారు.