రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలకు సం బంధించి ఇకనుంచి ఎన్‌ఐఎన్ సహకారం అందించనుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దీంతో గురుకుల పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన ఆహా రం అందించేందుకు మరో ముందడుగు వే సింది.
ప్రభుత్వ హాస్టళ్లు, గురుకులాల్లో ఆహా ర భద్రతతో పాటు నాణ్యతా ప్రమాణాలను పెంపొందించేందుకు హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (జాతీ య పోషకాహార సంస్థ) సహకారం తీసుకుంటుంది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసి డెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ (టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐఎస్) ఆధ్వర్యంలో రాష్ట్రంలో 268 రెసిడెన్షియల్ విద్యాసంస్థలున్నాయి.
వీటిలో 5వ తరగతి నుంచి ఇంటర్ వరకు 1.70 లక్షల మంది చదువుతున్నారు. వీరికి రోజూ భోజనంతో పాటు స్నాక్స్ అందించే కామన్ డైట్ కార్యక్రమాన్ని ప్రభుత్వం తా జాగా ప్రారంభించింది. రాష్ట్రంలో తాజాగా కొన్నిచోట్ల ఫుడ్ పాయిజనింగ్ ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఇలాంటి కట్టుదిట్టమైన చర్యలకు పూనుకొంటున్నది.