calender_icon.png 26 November, 2024 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్స్‌లో వాంకిడి విద్యార్థిని శైలజ మృతి

26-11-2024 03:30:36 AM

  1. అక్టోబర్ 30 విషాహారం తిని అస్వస్థత
    1. నవంబర్ 5న నిమ్స్‌కు తరలింపు
    2. అప్పటినుంచి వెంటిలేటర్‌పై చికిత్స
    3. పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలింపు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (విజయక్రాంతి): గత కొన్ని రోజులుగా నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతున్న కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి ఆశ్రమ పాఠశాల విద్యార్థిని శైలజ(16) మృతిచెందింది. అక్టోబరు 30న పాఠశాలలో భోజనం చేసిన తర్వాత దాదాపు 60 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. విరేచనాలు, వాంతులు కావడంతో వారందరినీ సమీపంలోని ఆసుపత్రు లకు తరలించి చికిత్స అందించారు.

వీరిలో ముగ్గురి పరిస్థితి విషమించడంతో నవంబర్ 5న మెరుగైన వైద్యం కోసం నిమ్స్ దవాఖానకు తరలించారు. ఇద్దరు బాలికలు పూర్తిగా కోలుకోవడంతో డిశ్చార్జి చేశారు. కానీ, శైలజకు అప్పటినుంచి వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తూ వచ్చారు. చికిత్సకు శరీరం సహకరించడం లేదని, పరిస్థితి విషమించడంతో సోమవారం మధ్యాహ్నం బాలిక మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు ప్రకటించారు. విద్యార్థిని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.

విద్యార్థి మృతికి ప్రభుత్వమే కారణం: హరీశ్‌రావు

విద్యార్థి శైలజ మృతికి రేవంత్ సర్కారే బాధ్యత వహించాలని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శైలజ మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ప్రాణాలు బలి తీసుకున్న పాపం ఈ దుర్మార్గపు కాంగ్రెస్‌ను వెంటాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 25 రోజులుగా వెంటిలేటర్‌పై అనుభవించిన నరకానికి ప్రభుత్వమే జవాబుదా రీగా ఉండాలన్నారు. ఆమె తల్లిదండ్రులకు గుండె కోతను సీఎం రేవంత్ మిగిల్చారని విమర్శించారు.

చిన్నారి విషాహారంతో కన్నుమూయటం తనను తీవ్రంగా కలిచివేసిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం అభం, శుభం తెలియని గిరిజన బిడ్డకు శాపంగా మారిందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అల సత్వం విద్యార్థి ప్రాణాల మీదకు వచ్చిందన్నారు. చివరకు బాలిక చావును కూడా దాచి పెట్టాలనే ఉద్దేశంతో, దొంగచాటున మృతదేహాన్ని తరలించడం సిగ్గుచేటని మండిపడ్డారు. ఆమె కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

గిరిజన విద్యార్థి శైలజ మరణం ప్రభుత్వ హత్యేనని, ఏడాది పాలనలో గురుకులాల విద్యను కాంగ్రెస్ ప్రభు త్వం దిగజార్చిందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అస మర్థ పాలన మరో పేద బిడ్డ ప్రాణం తీసిందని ఎమ్మెల్సీ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. 20 రోజులుగా చికిత్స పొందుతున్న చిన్నారి శైలజ మరణవార్త తనను కలిచివేసిందన్నా రు.11 నెలల పాలనలో 43 మంది విద్యార్థు ల ప్రాణాలు తీసిందని, ఇవన్నీ సీఎం రేవంత్‌రెడ్డి చేసిన హత్యలేనని ఆరోపించారు.