calender_icon.png 14 March, 2025 | 4:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిమ్జ్ భూఅభిప్రాయ సేకరణలో రసాభాస

13-03-2025 02:10:16 AM

  1. ప్రాజెక్టుకు భూములిస్తామని ఓ వర్గం.. ఇవ్వమంటూ మరో వర్గం
  2. మామిడ్గి గ్రామసభలో రెండువర్గాల మధ్య ఘర్షణ
  3. గ్రామసభను మధ్యలోనే నిలిపేసిన రెవెన్యూ అధికారులు 

సంగారెడ్డి, మార్చి 12 (విజయక్రాంతి)/న్యాల్‌కల్ : జాతీయ పారిశ్రామిక ఉత్పత్తి మండలి(నిమ్జ్) ఏర్పాటుకు అవసరమైన భూసేకరణ కోసం గ్రామసభ ఏర్పాటు చే  రెండువర్గాల మధ్య గొడవ జరిగి స  మధ్యలో నిలిపివేశారు. బుధవారం సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలంలోని మామిడ్గిలో నిమ్జ్ ప్రాజెక్ట్ డిప్యూటీ కలెక్టర్ రాజు, రెవెన్యూ అధికారులు గ్రామసభ ఏ  చేశారు.

గ్రామంలో ఒకవర్గం వారు వ్యవసాయ భూములు ఇవ్వమని అధికారులకు తేల్చిచెప్పారు. గ్రామానికి చెందిన మరో  ప్రాజెక్ట్ కోసం భూములు ఇస్తామని పేర్కొన్నారు. ఇంకోవర్గం వారిని మీ   అడ్డకుంటున్నారని నిలదీశారు. దీం  మామిడ్గి గ్రామానికి చెందిన రెండు వ  మధ్య ఘర్షణ జరగడంతో నిమ్జ్ ప్రా  డిప్యూటీ కలెక్టర్ రాజు గ్రామసభ నుంచి వెళ్లిపోయారు.

న్యాల్‌కల్ తహసీల్దార్ భూపా  నయాబ్ తహసీల్దార్ రాజిరెడ్డి సమావేశం  పాల్గొన్నారు. గ్రామానికి చెందిన 55 మంది రైతులు ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకున్నారు. వీరివి అసైన్డ్ భూములు కావడంతో నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూములిస్తా మని అంగీకరించి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. గ్రామంలో వాణిజ్య పంటలు పండే వ్యవసాయ భూములు ఉన్నాయని, తము భూములు ఇవ్వమని మరికొందరు తెలిపారు.

దీంతో రెండువర్గాల మధ్య ఘర్ష ణతో సభను మధ్యలోనే ఆపేశారు. వ్యవసాయ భూములకు తక్కువ ధర చెల్లిస్తున్నా రని కొందరు రైతులు వాపోయారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరనే చెల్లిస్తామని నిమ్జ్ ప్రా  అధికారులు ప్రకటించారు. మార్కె  ధర ఇవ్వకపోతే వ్యవసాయ భూములు ఇచ్చేది లేదని రైతులు చెప్పారు.