హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 31(విజయక్రాంతి): సూడాన్ దేశానికి చెందిన దంపతుల కుమారుడికి నిలోఫర్ ఆస్పత్రి వైద్యులు పునర్జన్మనిచ్చారు. వివరాల్లోకి వెళితే.. సూడాన్ దేశానికి చెందిన దంపతులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డను కనేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఆ మహిళ(సైదా)కు గతంలో ఐదుసార్లు అబార్షన్ అయ్యింది.
అనంతరం నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో ఐవీఎఫ్ ద్వారా సైదా మగపిల్లాడికి జన్మనిచ్చింది. అయితే బాలుడి పుట్టుకనతోనే బ్లడ్, బ్రెయిన్ ఇన్‌ఫెక్షన్‌తో ఉన్నాడు. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆరు రోజుల పాటు ఆ ఆస్పత్రి ఐసీయూలోనే ఉంచారు. అయితే వారి దగ్గర ఉన్న డబ్బులు అయిపోవడంతో వైద్యులు నిలోఫర్ ఆస్పత్రికి రిఫర్ చేశారు.
నిలోఫర్ ఆస్పత్రి వైద్యు ఆ పసి బాలుడికి సుమారు నెలరో పాటు వైద్యం అందించడంతో పాటు ఆ దంపతులకు భోజన వసతిని కూడా ఏర్పా చేశారు. ఆ బాలుడు పూర్తిగా కోలుకోవడం మంగళవారం డి చేసినట్లు నియోనాటలజిస్ట్ డాక్టర్ స్వప్న తెలిపారు. చావు బతుకుల్లో ఉన్న తన బిడ్డకు పునర్జన్మను ప్రసాదిం డాక్టర్లకు ఆ తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.